మహిళలు స్లిమ్‌గా ఉండాలంటే ఏం చేయాలి!?
మహిళలూ.. మీ శరీరం లావుగా కాకుండా ఎగిరే పక్షిలా వుండాలంటే కొన్ని నియమాలను పాటించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముందు ప్రతిరోజూ భోజనం టైమ్‌కి తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ తగినంత మాత్రమే చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు, పచ్చికూరగాయలు ఆహారంగా తీసుకోండి. ఇవి ఆకలి మితంగా వుండటానికి జ్ఞాపకశక్తికి చక్కని శరీరాకృతిని మంచి ఛాయ రావడానికి తోడ్పడుతుంది. మధ్యాహ్న భోజనంలో అన్నం ఆకుకూరలు, పప్పు, మజ్జిగ తీసుకోవాలి. భోజనానికి ముందుగా ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఒక టమోటా లేదా ఓ దోసకాయ మిరియాలపొడి చల్లుకు తినాలి. కాఫీ, టీలు చాలావరకు తగ్గించాలి. ఒకటి లేదా రెండు సార్లకే పరిమితం కావాలి. నిమ్మరసం వారానికి ఒకసారి త్రాగితే మంచిది. సాయంత్రం టిఫెన్‌గా అటుకులు లేదా పేలాల్లో ఉల్లిగడ్డ ముక్కలు కలుపుకుని తింటే బరువు ప్రభావం అంతగా ఉండదు. రాత్రి భోజనంలోకి రెండు చపాతీలు ఒక గ్లాసు మజ్జిగ ఓ టమోటాను తిని కడుపు నిండా నీరు త్రాగాలి. వారానికి ఒకసారి మాంసాహారాన్ని తీసుకోండి. చిరుతిండ్లు మానుకోవాలి. వంటలను సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో చేస్తే బరువును నియంత్రిస్తుంది. ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. రెండు గంటల వ్యవధి ఉండాలి. ఇక వ్యాయామం సంగతికి వస్తే.. స్కిప్పింగ్ లేదా సైక్లింగ్ పార్కులు లేదా గార్డెన్, వ్యాయామశాలలో చేయండి. ఒక అరగంట స్పీడ్ వాకింగ్ చేయండి. వీలుకాని వారు మీ ఇంటి దగ్గరే బాల్కనీ లేదా మీ వీధి పరిసరాల్లో చేయవచ్చు. రోజూ మార్నింగ్ వాకింగ్ చేయడం తప్పనిసరి. ఇలా చేస్తే మీరు స్లిమ్‌గా తయారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.