బేకరీ ఐటమ్స్ బర్గర్, పిజ్జాలలో ఆరోగ్యపరంగా ఏది మంచిది?
, సోమవారం, 28 జనవరి 2013 (15:43 IST)
బేకరీ ఐటమ్స్, ప్రాసెస్‌డ్ పుడ్స్ అన్నీ మంచివి కావంటారు. ఒక వేళ అవి తప్ప వేరే అవకాశం లేనపుడు కేవలం బర్గర్, పిజ్జా ఈ రెండు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఏది మంచిదో తెలుసుకుందామా! ఆ రెండింటిలో దేనిలో కూరగాయలు, ఆకుకూరల పాళ్లు ఎక్కువుగా ఉంటే అది తినడం మంచిది. ఇలాంటివి తినాల్సి వచ్చినపుడు వాటిలో పొట్టు తీయని ధాన్యంతో పిండి పట్టి తయారు చేసినవి ఏమిటో కూడా తెలుసుకోండి. ఎందుకంటే పొట్టు తియ్యని ధాన్యం చేసిన బ్రెడ్‌తో రూపొందించిన ఆహారం మామూలు పిండితో చేసిన దాని కంటే మంచిదని గ్రహించండి. అదే తినండి.