బాలింతలు డైటింగ్ చేస్తున్నారా? ఐతే కాయగూరలు తినండి!
మీరు ఓ బిడ్డకు తల్లి అయ్యారా..? లేదా డెలివరీతో ఊబకాయం బాధపడుతూ.. డైటింగ్ చేయాలంటూ ప్రతీరోజూ ఏవేవో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అయితే ఇవన్నీ పక్కనబెట్టి కాయగూరలను మాత్రం ఆహారంలో ఎక్కువ మోతాదు చేర్చుకుంటే చాలునని డైట్ సైంటిస్టులు చెపుతున్నారు. ఓ బిడ్డ పుట్టిన తర్వాత మహిళలు సాధారణంగా కాస్త లావు కావడం సహజమే. కన్జూమింగ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మహిళలు ఆ సమయంలో కాస్త పుష్టిగా తయారవుతారు. కానీ శరీరాకృతి పెరిగిపోవడంపై బాలింతలు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజు వారీ ఆహారంలో పండ్లు, కాయగూరలు తీసుకుంటే చాలునని డచ్ సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో డచ్ సైంటిస్టులు జరిపిన ఓ పరిశోధనలో 80 శాతం మంది బాలింతలు కాయగూరలను తినడం ద్వారా కాల్షియం, మాగ్నీషియం వంటివి లభించి, తమ తమ శరీరాకృతి తగ్గించుకున్నారని తేలింది. అలాగే అరటి పండ్లు, పొటాటో వంటివి తీసుకోవడం ద్వారా బాలింతల శరీరాకృతి పెరిగిపోతుందని కనిపెట్టారు. పండ్లు, కాయగూరలు, అన్నం వంటి తొమ్మిది వారాల తీసుకున్న మహిళలు తమ శరీరాకృతిని తగ్గించుకున్నారని పరిశోధనలో తేలింది.