ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్ తింటున్నారా.. అయితే ఊబకాయం గ్యారెంటీ!
, మంగళవారం, 22 జనవరి 2013 (17:57 IST)
పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా.. అయితే ఊబకాయం తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకునే వారు.. వెంటనే పండ్లు, దోసకాయ, క్యారెట్, టమేటో ముక్కలు వంటివి తినండి. ఇలా చేస్తే ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఆహారానికి ముందు స్వీట్ తింటే ఆకలిని మితం చేస్తుంది. ఇది ఊబకాయం నుంచి తప్పించుకునేందుకు ఓ మంచి ఉపాయం అయితే స్వీట్ పదార్థాలు కొవ్వులు, పిండి పదార్థాలు అధికంగా క్యాలరీలను శరీరంలో చేరుస్తాయి. ఒక గ్రాము కొవ్వు పదార్థం వల్ల 9 కిలోల క్యాలరీల శక్తి వస్తే, అదే గ్రాము ప్రోటీన్లు, కార్పొహైడ్రేడ్లు నాలుగు కిలోల క్యాలరీల శక్తిని మాత్రమే చేరుస్తాయి. కాబట్టి అధికంగా క్యాలరీలను అందించే కొవ్వులను దూరంగా ఉంచడం ద్వారా భారీకాయ సమస్యకు గురికాకుండా ఉండవచ్చు.