ప్రసవం తర్వాత బరువు తగ్గాలా.. అయితే లెమన్ జ్యూస్ తాగండి!
ప్రసవం తర్వాత బరువు తగ్గాలా.. అయితే లెమన్ జ్యూస్ తాగండి అంటున్నారు గైనకాలజిస్టులు. ప్రసవం అయిన తర్వాత చాలామంది మహిళలు పొట్టతో గర్భిణీలుగానే కనిపిస్తుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. గర్భధారణ సమయంలో యూట్రస్ విస్తరించబడి ఉంటుంది. అది తిరగి యథాస్థితికి, నార్మల్ షేప్ మరియు సైజ్‌కు రావడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా హార్మోన్లు మరియు డైట్లో మార్పులు కూడా మిమ్మల్ని ఫ్యాట్‌గా కనబడేలా చేస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా లెమన్ జ్యూస్ తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సింపుల్‌గా సెలవిస్తున్నారు. ప్రసవం తర్వాత నిమ్మజ్యూస్ తీసుకోవచ్చు. అయితే నిమ్మజ్యూస్‌కు పంచదార మిక్స్ చేయకుండా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి, కొవ్వు కరిగించడానికి పంచదారకు బదులు తేనెను మిక్స్ చేసుకోవచ్చు. శరీరంలో కొవ్వు కణాలను విచ్చిన్న చేయడానికి నిమ్మ మరియు తేనె చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ప్రసవం తర్వత, మహిళ ప్రతి రోజూ ఉదయం నిమ్మ మరియు తేనె మిశ్రమాన్ని తీసుకోవచ్చు.తాజాగా తయారుచేసిన తేనె మరియు నిమ్మజ్యూస్‌ను పరగడుపున ఒక గ్లాసు తీసుకోవాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు నెట్టివేస్తుంది. ఉదరాన్ని శుభ్రపరుస్తుంది. అయితే లెమన్ జ్యూస్‌ను కోల్డ్ వాటర్‌లో కాకుండా వెచ్చని హాట్‌వాటర్‌లో తీసుకోవచ్చు. ఇంకా సలాడ్స్ మరియు కొన్ని ప్రత్యేకమైన వంటలు తీసుకోండి. సలాడ్స్ కొవ్వును కరిగిస్తాయి. మీ సలాడ్స్‌లో నిమ్మరసాన్ని జోడించడం మరిచిపోకండి.