ఎండలో చాలా సేపటి నుంచి పనిమీద తిరిగిన కుసుమ ఈసురోమంటూ అప్పుడే ఇంటికి చేరింది. అబ్బా...! ఏదైనా చల్లగా తాగితే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఫ్రిజ్ ఓపెన్ చేసింది. చూస్తే అందులో ఏమీ లేక పోవడంతో.. గబగబా ఓ నిమ్మకాయను కోసి చక్కెర నీటిలో కలిపి, ఐస్‌క్యూబ్స్ వేసుకుని గటగటా తాగేసింది. కాస్తంత తేరుకున్నాక తిరిగి ఇంటిపనిలో పడింది.ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేమిటంటే... ఎండనబడి నడిచిన ఎవరికైనా చల్లగా తాగాలని అనిపించడం సహజం. ఆ చల్లటివి పండ్ల రసాలైతే మరీ మంచిది. తాజాగా తీసిన పండ్లరసం తాగటం వల్ల శరీరం సేదతీరటమే గాకుండా... మనసు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా తయారవుతుంది.క్యాన్సర్ నిరోధకారి ద్రాక్ష..! |
|
ద్రాక్షరసం మంచి జీర్ణకారి. అంతేకాదు, సన్నగా ఉన్నవారు త్రాగితే ఒంటికి బలం చేకూరుతుంది. ఇది మంచి క్యాన్సర్ నిరోధకారి కాగా, నెలసరి సమస్యలతో బాధపడే మహిళలకు బాగా పనిచేస్తుంది... |
|
|
ఎందుకంటే... పండ్లరసాలలో రకరకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎంజైములతో పాటుగా నీరు తదితర ధ్రవపదార్థాలు ఉండటం వల్ల వెంటనే రక్తంలో కలిసిపోయి... శరీరం తక్షణ శక్తిని పుంజుకుంటుంది. అంతేగాకుండా... ఈ పండ్ల రసాలు తాగడం వల్ల శరీరంలోని మలినాలన్నీ తొలగిపోయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
పచ్చికూరగాయల రసం తాగినట్లైయితే శరీరంలో కొత్త కణాలు పుడతాయి. అంతేగాకుండా... శరీరం ముడుతలు పడకుండా, త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పళ్ల రసాలు ఏంటంటే...
కేరట్ రసం... ఇందులోని కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, యూరిక్ ఆమ్లాన్ని బయటకు పంపుతుంది. కాలేయ సంబంధ వ్యాధులు, క్షయ, కడుపులో నులిపురుగులున్న వారికి కేరెట్ జ్యూస్ చేసే మేలు అంతా ఇంతా కాదు.
బీట్‌రూట్ రసం... జబ్బుపడ్డవారు ఈ రసాన్ని తాగితే త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా కణితులు, వ్రణాలు, పుండ్లతో బాధపడేవారు ఈ జ్యూస్‌ను తాగితే త్వరగా మానిపోతాయి.
బొప్పాయి రసం... బొప్పాయిలోని విటమిన్ ఎ, విటమిన్ సి, ఖనిజ లవణాలు, పీచు పదార్థం పుష్కలంగా ఉండంటం వల్ల అజీర్తిని, రక్తం గడ్డలు కట్టడాన్ని నివారించి శరీరానికి మంచి నిగారింపును కలుగజేస్తుంది. తరచుగా బొప్పాయిరసం తాగితే... ఎసిడిటీ, అజీర్తి, రక్తహీనత, కంటి జబ్బులకు దూరంగా ఉండవచ్చు. బొప్పాయి వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనీయదు.
అల్లం రసం... ఒంటికి నీరు పట్టినవారు, ఆస్తమా, మొలలు, దగ్గు, కామెర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ భోజనానికి ముందు అల్లం రసం తీసుకుంటే మందులు వాడాల్సిన అవసరమే ఉండదు.
ద్రాక్షరసం... ద్రాక్షరసం మంచి జీర్ణకారి. అంతేకాదు, సన్నగా ఉన్నవారు త్రాగితే ఒంటికి బలం చేకూరుతుంది. ఇది మంచి క్యాన్సర్ నిరోధకారి కాగా, నెలసరి సమస్యలతో బాధపడే మహిళలకు బాగా పనిచేస్తుంది.
టమోటా రసం... దీంట్లో పొటాషియం, మెగ్నీషియం, మినరల్స్, విటమిన్ ఎ, పీచుపదార్థం లాంటివి పుష్కలంగా లభిస్తాయి. దీంట్లో చక్కెర శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి మంచి వరంగా చెప్పుకోవచ్చు. అంతేగాకుండా, గ్యాస్, కాలేయ సంబంధిత వ్యాధులను ఇది నివారిస్తుంది. రోజుకు నాలుగైదు టమోటాలు తింటుంటే బి కాంప్లెక్స్ మాత్రలతో పనే ఉండదంటే అతిశయోక్తి కాదు.