Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డైటింగ్ చేస్తున్నారా..? ఇవి పాటించండి..!

Advertiesment
మహిళ ఆహారం ప్రపంచం అధిక బరువు మహిళ శరీరం చురుకు స్లిమ్ చిట్కాలు డైటింగ్ కడుపు తినడం ఆహార నియంత్రణ
, బుధవారం, 22 అక్టోబరు 2008 (17:53 IST)
FileFILE
ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న మహిళలు, తమ శరీరాన్ని చురుకుగా, స్లిమ్‌గా ఉంచుకునేందుకు పాటించని చిట్కాలు లేవు. ఏం చేసినా బరువు తగ్గని వారు డైటింగ్‌లంటూ కడుపు మాడ్చుకోవటాన్ని కూడా మనం చూస్తుంటాం.

అసలు డైటింగ్ అంటే... పూర్తిగా తినకుండా కడుపును మాడ్చుకోవటం కాదు. సరైన ఆహార నియంత్రణ పాటిస్తూ, చిన్న చిన్న వ్యాయామాలను పాటించటమే డైటింగ్ అనేదానికి పూర్తి అర్థాన్నిస్తుంది. డైటింగ్ చేయడం వల్ల కేవలం శరీరం బరువు తగ్గటం మాత్రమే కాకుండా, అనవసరమైన క్యాలరీలు శరీరంలో పేరుకోనీయకుండా చేసుకున్న వారలం అవుతాము.

ఎలాంటి వయస్సులోనైనా చురుకుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి డైటింగ్ చాలా చక్కగా దోహదపడుతుంది. అయితే డైటింగ్ చేసేవారు ఎలాపడితే అలా ఆహార పదార్థాలను తీసుకోకుండా, ఓ పద్ధతి ప్రకారం తీసుకున్నట్లయితే శరీరం బరువును కంట్రోల్‌ పెట్టుకోవడం సాధ్యమవుతుంది.

ఇప్పుడు మనం డైటింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

ఉదయంపూట అల్పాహారంగా... గోరువెచ్చటి పాలు, కార్న్‌ప్లేక్స్, బ్రెడ్డు గుడ్డులోని తెల్లని పదార్థాలు రెండు, పండ్లు, ఇడ్లీ, బిస్కెట్లు, టీ. తీసుకుంటే సరిపోతుంది. అలాగే, స్నాక్స్ సమయంలో... పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు, కొబ్బరినీళ్ళు లాంటివి ఉంటే మంచిది.

ఇక మధ్యాహ్నం భోజనంలో... గోధుమ రొట్టెలు, అన్నం, పప్పులు, కూరగాయలు, పెరుగు, పండ్లూ లేదా సూప్, రోస్ట్ లేదా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, మాకరోని లాంటివి తీసుకోవాలి. అలాగే రాత్రి భోజనం సమయంలో... చపాతీలు, అన్నం, సూప్, కూరగాయలు, సలాడ్‌లు, చేపలు, చికెన్ లాంటివయితే మంచిది.

పైన మనం చెప్పుకున్న ఆహారం కేవలం డైటింగ్ చేస్తున్నవారే కాకుండా, సాధారణ బరువుతో ఉన్నవారు కూడా పాటిస్తే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇకపోతే... ఖచ్చితంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా రెండు బిస్కెట్లు, పండ్లు, బ్రెడ్డు, (ఒక స్లైసు) ఇడ్లీలు, వెన్నతీసిన పాలు, కార్న్‌ప్లేక్స్ల్ లాంటివి తీసుకోవాలి.

ఫ్రై చేసిన పదార్థాలు, కొవ్వుశాతాలు ఎక్కువగా ఉండే వెన్న, మీగడ, పెరుగు, నెయ్యి, మాంసం, గుడ్డులోని పచ్చసొన, అరటి పండ్లు, సోయాబీన్, పండ్లరసాలు, కృత్రిమంగా తయారైన సూప్‌లు లాంటి పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. అలాగే తీపి పదార్థాలు తీసుకోవడం వీలయినంతవరకు తగ్గించాలి.

తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినడం, తినేటప్పుడు ఒకేసారి కంచంలో మొత్తం వడ్డించుకోకుండా కొద్దికొద్దిగా పెట్టుకొని తినడం లాంటివి చేయాలి. ఇకపోతే, ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

Share this Story:

Follow Webdunia telugu