డయాబెటిస్, హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టే స్ట్రాబెర్రీస్!
, సోమవారం, 9 జులై 2012 (15:07 IST)
స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌లంటే మీకు చాలా ఇష్టమా.. అయితే స్ట్రాబెర్రీ పండ్లను ఐస్‌క్రీమ్ రూపంలో గాకుండా స్ట్రాబెర్రీ పండ్లను అలాగేనూ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే డయాబెటిస్, హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వార్విక్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. కార్డియోకు సంబంధిత వ్యాధులు ముఖ్యంగా గుండెపోటుకు చెక్ పెడుతుందని వార్విక్ యూనివర్శిటీ తెలిపింది.స్ట్రాబెర్రీలోని ఎన్ఆర్ఎఫ్2 మన శరీరానికి కావాల్సిన యాంటియాక్సిడెంట్లును పెంపొందింపజేస్తుందని వార్విక్ పరిశోధకులు తెలిపారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె సంబంధిత రోగాలు దరిచేయకుండా చేయడంలో స్ట్రాబెర్రీ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుచేత వారానికి రెండుసార్లు స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితముంటుందని పరిశోధకులు అంటున్నారు.