Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జామ కాయ అంటే మరీ అంత అలుసా...!

Advertiesment
మహిళ ఆహారం జామ కాయ  పండు పోషకాలు విటమిన్లు పీచు పదార్థం మధుమేహం పళ్లు ఔషధం

Raju

, శనివారం, 1 నవంబరు 2008 (04:53 IST)
చిన్నప్పుడు ఊర్లలో పుట్టి పెరిగేటప్పుడు ఏ ఇంట్లో అయినా, పొలం గట్టుమీద అయినా జామచెట్టుపై పక్వానికి వచ్చిన కాయలు కనబడ్డాయంటే చాలు వాటిని ఎలాగో అలా ఓ పట్టు పట్టి తుంపి కర కర మని తిని చప్పరించో రోజులు గుర్తు వస్తే ఇప్పుడు మనసు అదోలా అయిపోతుంది. ఎందుకంటే ఆ ఊరు.. ఆ జామకాయ.. ఆ వగరు, తీపిల మధురానుభూతి బాల్యంతోనే ముగిసిపోయింది మరి.
జాంపండురో..
  ప్రపంచంలో పళ్లు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోండి అంటూ మధుమేహ రోగులకు చెబుతూ ఉండే వైద్యులు సైతం చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో చేర్చి చెబుతుంటారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు జామ పపర్ ఏమటో..      


కానీ అప్పుడూ ఇప్పుడూ జామకాయ చౌకగానే అందుబాటులో ఉంటోంది. మహానగరాల్లో అన్నీ రేట్లే కాబట్టి జామకాయలు కూడా పదిరూపాయలకు మూడు, నాలుగు, ఆయిదు అని సైజును బట్టి ధర చెబుతుంటారు కాని ఓ మాదిరి పట్టణాల్లో కూడా ఇప్పటికీ జామకాయ చౌగధరకో లభ్యమవుతూ ఉంటుంది.

అయితే చిన్నప్పుడు బాల్య చేష్టల్లో భాగంగా తోటల్లోని జామకాయలను మాయం చేసేసి నమిలేసినప్పటికీ అదే జామకాయ పెద్దయ్యాక అనివార్యంగా మనుషులకు వస్తున్న కొన్ని రకాల వ్యాధులకు వైద్య నివారిణిలా పనిచేస్తోందంటే ఆశ్చర్యమేస్తుంది.

జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల ప్రస్తుతం అందరికీ ఇది ప్రీతిపాత్రమై కూచుంది. చివరకు ప్రపంచంలో పళ్లు అనేవి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోండి అంటూ మధుమేహ రోగులకు చెబుతూ ఉండే వైద్యులు సైతం చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో చేర్చి చెబుతుంటారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు జామ పపర్ ఏమటో..

అందుకో జామకాయలో ఉన్న ఔషధ గుణాలను కాస్సేపు చూద్దామా...

చౌకగా లభించే జామకాయ లేదా పండులో పోషకాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.

జామకాయలో ఉండే పీచు పదార్ధం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. జామలోని పీచు పదార్ధం డయాబెటిస్ రోగులకు సంజీవనిలా ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం మరి.

అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు.

ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం జామ పండు కంటే జామ కాయను తినడం శ్రేష్టం. కాయ గట్టిగా, ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే ఎంచుకుని దోరగా ఉన్నప్పుడే తినేస్తే దాని పూర్తి గుణం శరీరానికి అందుతుంది.

కాబట్టి చౌక జామ అని కొట్టి పారేయగండి. కాస్త దోరగా ఉన్న జామ కాయ రుచిని ఇకనైనా ప్రతి రోజూ తిని ఆస్వాదించండి. రుచులలోన జామ రుచియే వేరు....

Share this Story:

Follow Webdunia telugu