చర్మం నిగారింపు కోసం కృత్రిమ సాధనాలను వాడేకంటే ఆహారంతోనే సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు చేపలను ఆహారంగా తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. బాగా తైలం కలిగిన చేపలు మరీ మంచివి. వీటిలో ఒమేగా-3 పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్ ఉంటుంది కనుక గుండె జబ్బులను రానివ్వదు. అలాగని ఎండు చేపలను తినడం మంచిది కాదు. ఒకవేళ ఆ అలవాటు ఉన్నవారు తగ్గించుకోవడం మంచిది.
ఇక మాంసం విషయానికి వస్తే... వారానికి ఒకసారికి మించి తినకూడదు. కొవ్వులు తక్కువగా ఉండే మాంసాలనే తినాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే మాంసాహారాన్ని తీసుకోవాలి. లేదంటే మాంసంతోనూ ఇబ్బందే.
సాధ్యమైనంతవరకూ మాంసాహారానికి దూరంగా ఉండండి. దీనివల్ల శరీరంలో ప్రమాదకరమైన రీతిలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులకు కారణమవుతుంది. కనుక ఏ ఆహార పదార్థాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.