చర్మానికి ఎంతో మేలు చేసే ద్రాక్షపండ్లు!
ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా మీ చర్మం కాంతివంతమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహార పదార్థాలతో, మందుల్లో వాడే ద్రాక్షపండ్లను రోజువారీగా తీసుకుంటుందే చర్మ రంగును కాపాడుతుంది. 40
ఏళ్లకు పైబడిన మహిళలకు నెలసరి సమస్యలు తొలగిపోవాలంటే ద్రాక్ష రసం రోజూ మూడు పూటలూ అర గ్లాసుడు చొప్పున తీసుకుంటూ వుండాలి. కాళ్లు చేతులు వణకడం, అలసట, అనారోగ్యం వంటి రుగ్మతలకు చెక్ పెట్టాలంటే ద్రాక్ష పండ్లను రోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ మధ్యాహ్న భోజనానికి తర్వాత అరగ్లాసుడు ద్రాక్ష రసాన్ని తీసుకుంటే ధైర్యం కూడా పెరుగుతోంది. అప్పడప్పుడు భయపడే గుణానికి చెక్ పెట్టవచ్చు. ద్రాక్ష రసంతో పంచదార చేర్చి 21 రోజుల పాటు పరగడుపున తాగితే మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. నెలసరి, ఉదరసంబంధిత వ్యాధులు, నోటిపూత వంటివి తొలగిపోవాలంటే ద్రాక్ష రసానికి మించిన ఔషధం లేదనే చెప్పాలి.ఆహారానికి తర్వాత ప్రతీరోజూ 15 ద్రాక్షల్ని తింటే తలనొప్పికి చెక్ పెట్టవచ్చును. అలాగే 40ఏళ్లకు పైబడిన వారు రాత్రి ఆహారం తీసుకున్నాక ఎండు ద్రాక్షల్ని తీసుకుంటే చర్మానికి రక్షణ ఇస్తుంది. ముడతల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.