అవునండి.. గుండె జబ్బులను దూరం చేసుకోవాలంటే చేపలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి.
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి వుండటం ద్వారా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపల తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి తగ్గిస్తుంది.
ఇంకా విటమిన్ ఎ, డి చేపల్లో పుష్కలం. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహదపడుతుంది.
చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా ఎముకలు బలం అవుతాయి. ఇంకా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు చెబుతున్నారు.