గర్భిణీ స్త్రీలు తాము తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఆకు కూరలుండేలా చూసుకోవాలని వైద్యులు అంటున్నారు. గోధుమ రొట్టెలు లేదా సగ్గుబియ్యంతో చేసిన రొట్టెలు తమ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు తెలిపారు.
మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోండి. అంటే కొన్ని తీపి పదార్థాలు మైదాతో తయారు చేస్తారు. ఎలాంటి పరిస్థితులలో మైదాను ఆహారంగా తీసుకోకూడదు.
చీనీపండ్లు, ద్రాక్ష, అరటి పండ్లు ప్రతి రోజూ ఆహారంగా తీసుకోండి. అన్ని రకాల పప్పుదినుసులు, బీన్స్, పాలు, పెరుగు పదార్థాలు మీరు తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఇంకా ఎండు ద్రాక్ష, అక్రోట్, బాదంపప్పు తదితరాలు ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. వీటి ద్వారా శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాఫీ, టీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ లాంటివి తీసుకునే అలవాటుంటే వాటిని వెంటనే మానేయండి. కోకాకోలా, పెప్సీలాంటి చల్లని పానీయాలలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఇలాంటి పదార్థాలు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
గర్భిణీ స్త్రీలకు క్యాలరీలు ఎంతమేరకు అవసరం?
సాధారణ మహిళకు రోజుకు 2100 క్యాలరీలు అవసరమౌతుంది. అదే గర్భిణీ స్త్రీలకైతే 2500 క్యాలరీలు అవసరం అవుతుంది. శిశువుకు పాలిచ్చే మహిళకైతే 3000 క్యాలరీలు అవసరం. 10శాతం క్యాలరీలు ప్రొటీలన్లద్వారా అలాగే 35శాతం క్యాలరీలు నూనె, నెయ్యి, వెన్నలాంటి పదార్థాలనుండి లభిస్తాయి. మిగిలిన 55శాతం క్యాలరీలు కార్బోహైడ్రేట్ల ద్వారా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
శరీర బరువు గురించి బెంగ అవసరం లేదు:
గర్భిణీ స్త్రీలు బరువు పెరగడంపై బెంగపడాల్సిన పనిలేదంటున్నారు వైద్యులు. ప్రతి ప్రసూతి వైద్యురాలు గర్భిణీ స్త్రీలు తొలి మాసం చెకప్‌కు వెళ్ళినప్పుడు బరువు కొలుస్తారు. ఆ తర్వాత బరువును కొలవరు. ఎందుకంటే ఆ తర్వాత బరువులో పెద్దగా మార్పు ఉండదు.
తన సాధారణ బరువుకంటేకూడా గర్భందాల్చినప్పుడు బరువు పెరిగిందని గర్భిణీ స్త్రీలు అభిప్రాయపడుతుంటారు. దీనికి సంబంధించిన బెంగ అవసరం లేదంటున్నారు వైద్యులు.
మహిళలు శిశువుకు జన్మనిచ్చిన తర్వాత తగిన వ్యాయామం, ఆహార నియమాలను పాటిస్తే శరీర బరువు సాధారణ స్థాయికి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.