కర్బూజతో మహిళలకు చక్కని స్తనాల ఆకృతి....!
వేసవి కాలం వచ్చిందంటే చాలు కర్బూజాలు, మామిడి, పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకొదగ్గవి మాత్రం కర్బూజ పండ్లు. ఇవి మామిడి పళ్లంత రంగూ రుచీ ఉండవు, పుచ్చకాయలంత ఆకర్షణీయంగానూ కనిపించవు. అందుకే చాలామంది దృష్టి వీటి మీదకు పోదు. కాని కర్బూజ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కొవ్వు పదార్థాలు అత్యంత తక్కువుగానూ, పీచు పదార్థాలు అధికంగానూ ఉండే ఈ పండు బరువు తగ్గాలనుకునే వారికి వరం లాంటింది. ఇందులో పోటాషియం అధిక రక్తపోటును క్రమేపీ తగ్గిస్తుంది. వీటిలో పుష్కలంగా లభ్యమయ్యే కెరొటినాయిడ్లు మహిళల్లో స్తనాల ఆకృతి చక్కగా ఉండేలా చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఈ పండ్లలోని పీచుపదార్థాలు మలబద్ధకానికి మంచి మందు. శరీరంలోని కణాలను ధ్వంసం చేసి ఫ్రీరాడికల్స్‌ని నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కర్బూజ పండ్లలో అధికంగా ఉంటుంది.