ఐరన్ లోపం కారణంగా రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
శిశువుకు అరునెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆరునెలల నుంచి తల్లి పాలతో పాటు ఇంట్లోనే తయారుచేసిన కాంప్లిమెంటరీ ఫుడ్ ఇవ్వాలి. ఒక్కోక్కటి మెల్ల మెల్లగా అలవాటు చేయాలి. లేకపోతే అతిసారానికి గురయ్యే ప్రమాదం ఉంది.
సాధారణంగా బయట దొరికే కాంప్లిమెంటరీ ఆహారంలో ఇనుము తగినంత ఉండదు. కాబట్టి వండిన ఆహారాన్ని మెత్తని పేస్టులాగా తయారుచేసి ఇస్తే మంచిది.
అన్నం - పప్పు, ఆకుకూరలను బాగా ఉడికించి, మెత్తగా, మృదువుగా తయారుచేసి తినిపించాలి. మసాలాలు, కారం ఎక్కువగా ఉండకూడదు.
అన్నం, పప్పు, కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు, కొత్తిమీర, టమాటా, క్యారెట్లు ఎక్కువగా ఇస్తే ఇనుము లోపం తలెత్తే అవకాశమే ఉండదు.
సజ్జల వంటి చిరుధాన్యాలను మొదట రోస్ట్ చేసి, పొడిగా తయారుచేసి, మెత్తని పేస్టు రూపంలో ఇస్తే సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు.