ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం సరిపోదు.. న్యూట్రీషన్ల సలహా తీసుకోండి.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వ్యాయామం మాత్రం చేస్తే సరిపోదు. శరీర ఆకృతికి తగ్గట్లు ఆహారాన్ని ఎంచుకోవాలి అంటున్నారు న్యూట్రీషన్లు. పోషకాలుండే ఆహారాన్ని మాత్రమే తీసుకుని, న్యూట్రీషన్ల సలహాలను కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ వుండాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా వుండాలంటే ముందుగా శరీర బరువు, ఎత్తు, జీవన విధానం, ఆహారపు అలవాట్లను ఒక పరిశీలించుకోవాలి. తర్వాత శరీరానికి తగ్గట్లు ఆహారాన్నిఎంచుకోవాలి. శరీరం బరువు అధికంగా గలవారు ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉండేలా తీసుకోవాలి. వారానికి ఒక్కసారి మాత్రం మాంసాహారాన్ని ఎంచుకోవచ్చు. పండ్లు, సలాడ్లు, కాయగూరలు తీసుకోవాలి. తృణధాన్యాలు సైతం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీర బరువు తగ్గాలంటే రోజూ.. అల్పాహారానికి తర్వాత అర కప్పు మొలకెత్తిన తృణధాన్యాల్ని తీసుకోవాలి. పండ్ల రసాల కంటే అలాగే పండ్లను తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు.