అల్పాహారంగా యాపిల్ జ్యూస్ తీసుకుంటే స్లిమ్ అవుతారట!
మహిళలు సాధారణంగా పనుల హడావుడిలో అల్పాహారం శ్రద్ధచూపారు. కొందరైతే ఏకంగా అల్పాహారం మానేసి ఏకంగా మధ్యాహ్నం భోజనంతో సరిపెట్టుకుంటుంటారు. ఇలా చేయడం ద్వారా ఊబకాయం తప్పదని న్యూట్రీషన్లు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ అల్పాహారం తీసుకోవడం ఆవశ్యమని వారు సూచిస్తున్నారు. ఇడ్లీ, దోస, పూరీ వంటి ఆహారం కంటే యాపిల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా స్లిమ్ అవుతారని నాట్టింగ్‌హామ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా షుగర్‌తో కూడిన డ్రింక్, పాలు, వైట్ బ్రెడ్, జామ్ వంటివి తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ జీఐ అల్పాహారం తీసుకున్న వారిలో రక్తంలో గ్లూకోజ్ నిల్వలు అధికంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అల్పాహారాన్ని తక్కువ మోదాలో తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.