మహిళలు తప్పకుండా క్యాలీఫ్లవర్ తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. క్యాలీఫ్లవర్ స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B ఉండటంతో ఒబిసిటీని దూరం చేస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే ఆరోగ్యానికి కావలసిన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా క్యాలిఫ్లవర్‌లో విటమిన్ C - కాల్షియమ్ కూడా లభిస్తాయి. ఇందులోని ఫ్యాట్ లేకపోవడంతో మహిళలు స్లిమ్‌గా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ పదార్థాలను ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు వీటిని తీసుకుంటే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి.
ఇంకా ఎ విటమిన్ పుష్కలంగా ఉండే క్యారెట్ చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడే స్త్రీలు క్యారెట్‌ను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బీన్స్‌ను తీస్కోవడం ద్వారా గుండె పని తీరు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.