Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భిణీలు తీసుకోకూడని పదార్థాలు ఏమిటో తెలుసా?

గర్భిణీలు తీసుకోకూడని పదార్థాలు ఏమిటో తెలుసా?
, మంగళవారం, 23 మే 2023 (16:27 IST)
గర్భం ధరించిన తర్వాత మహిళలు తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పదార్థాలను తీసుకోవడానికి దూరంగా వుండాలి. అవేమిటో తెలుసుకుందాము. షార్క్, స్వోర్డ్ ఫిష్, టూనా చేపలను గర్భిణీలు తీసుకోవడాన్ని దూరంగా పెట్టాలి. పచ్చి లేదా తక్కువగా ఉడికించిన మాంసం హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు కనుక వాటిని తీసుకోరాదు.
గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ తీసుకోవడం శిశువు పెరుగుదలపై ప్రభావం చూపి, తక్కువ బరువుతో పుట్టే అవకాశం వుంటుంది.
 
ముడి మొలకలు బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశం వుంది కనుక వాటిని బాగా ఉడికించి మాత్రమే తినాలి. అన్ని పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో బాగా కడిగి మాత్రమే తినాలి.
పాశ్చరైజ్ చేయని పాలు, చీజ్ వంటి ఆహారాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
గర్భధారణ సమయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు తింటే అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగవారు ధనియాలు తింటే?