Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లాట్ బెల్లీ కోసం సూపర్ 3 టిప్స్!

Advertiesment
Tips for Flat belly
, సోమవారం, 24 నవంబరు 2014 (18:05 IST)
ఫ్లాట్ బెల్లీ కావాలంటే ఆహార నియమం చాలా అవసరం ఒక్కేసారి, ఎక్కువ మోతాదులు ఆహారాన్ని, కానీ లేదా ఏదైనా పదార్థాన్ని కానీ తీసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్‌గా కనిపిస్తుంది. అందుచేత కొంచెం మొత్తంలో అప్పుడప్పుడు తీసుకోవడం బెల్లీ ఫ్యాట్ తగ్గడంతో పాటు స్లిమ్‌గా తయారుకావొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఫ్లాట్ బెల్లీ కావాలంటే ఈవెనింగ్ స్నాక్స్ ప్రోటీన్ స్నాక్‌గా ఉండాలి. అంటే లో ఫ్యాట్ చీజ్ లేదా ప్రోటీన్ బార్ వంటివి తీసుకోవడం ఆరోగ్యకరం. శరీరంలో తగ్గిపోయే షుగర్ లెవల్స్ ను నిరోధిస్తాయి. షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు, ఆటోమాటిక్‌గా ఇన్సులిన్ లెవల్ తగ్గిపోతుంది. క్రమంగా శరీరంలో కొవ్వు నిల్వలు మొదలవుతుంది. కాబట్టి మూడు గంటల ప్రాంతంలో బాదం వంటి నట్స్‌ను మాత్రమే స్నాక్స్‌గా తీసుకోవచ్చు. 
 
అలాగే ఫ్లాట్ బెల్లీ పొందాలంటే, ఈ దీర్ఘకాల ట్రిక్‌ను అనుసరించాల్సిందే. తక్కువ షుగర్ ఉపయోగించడం వల్ల కొవ్వు, ఎనర్జీ రూపంలోకి మార్చే గ్లుకగాన్ పెంపొందించడంలో బాగా సహాయపడుతుంది.
 
ఇక మూడో సూపర్ ఏంటంటే.. ఆహారం మెత్తబడేవరకూ బాగా నమిలి తినాలి. బరువు తగ్గడంలో ఇదొక మంచి ట్రిక్. తినే ఆహారం ఏదైనా సరే బాగా నమిలి తినడం, ఎక్కువసార్లు నమలడం వల్ల, బెల్లీ దగ్గర నిల్వ ఉన్న కొవ్వు నిల్వలను బర్న్ చేసేందుకు ఇది బాగా సహాయపడుతుంది. దాంతో కడుపు ఉబ్బరంగా అనిపించదు. కడుపు నిండుగా ఉందన్న అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల తక్కువగా తినగలుగుతారు. దాంతో ఫ్లాట్ బెల్లి పొందగలుగుతారని న్యూట్రీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu