Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆల్ టైమ్ బ్యూటీగా కనిపించాలా? ఐతే మహిళలూ ఈ టిప్స్ పాటించండి!

మహిళలు వయస్సు మీద పడినా.. అందంగా కనబడాలని ఉబలాటపడతారు. పురుషులతో సమానంగా అన్నీ రంగాల్లో దూసుకెళ్తున్న నేటి మహిళలు.. అందంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Advertiesment
Super Simple Beauty Tips
, శుక్రవారం, 24 జూన్ 2016 (15:58 IST)
మహిళలు వయస్సు మీద పడినా.. అందంగా కనబడాలని ఉబలాటపడతారు. పురుషులతో సమానంగా అన్నీ రంగాల్లో దూసుకెళ్తున్న నేటి మహిళలు.. అందంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతేగాకుండా బ్యూటీపార్లర్ల కోసం బాగానే డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఆల్ టైమ్ బ్యూటీగా ఉండేందుకు వీలుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఆ టిప్స్ ఏంటో ఓసారి చూద్దాం.. ముందుగా అందంగా ఉండాలంటే.. మీలో ఆత్మవిశ్వాసం తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఆత్మవిశ్వాసమే ప్రత్యేక అందాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ పాజిటివ్‌గా ఆలోచించి నిద్రలేవండి.ఇక బ్రష్ చేసేటప్పుడు ఉప్పు నీటిలో పుక్కిలించండి. ఇది స్మైలింగ్‌‌‌ను జంకనీయకుండా చేస్తుంది. నవ్వేటప్పుడు దుర్వాసన లేకుండా చేస్తుంది. నోట్లోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. 
 
దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. తర్వాత రెండు గ్లాసుల నీరు తాగండి. ఇలా చేస్తే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. తద్వారా చర్మానికి ప్రత్యేక అందం చేకూరుతుంది. ఇక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం కోసం కేటాయించండి. తద్వారా హార్మోన్లకు కొత్త ఉత్తేజం లభిస్తుంది. తద్వారా నీరసం దరిచేరదు. ఇక పోషకాహారం తీసుకోండి. 
 
అల్పాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని గమనించండి. ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోండి. పీచుపదార్థాలు ఉండేలా చూసుకోండి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఫుడ్ తీసుకోండి. డైట్‌లో గ్రీన్ టీ తప్పకుండా చేర్చండి. కాఫీ, టీలను పక్కనబెట్టండి. గ్రీన్ టీలోని యాంటీయాక్సిడెంట్స్ యాంటీఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది. ఇక చర్మం నిగనిగలాడాలంటే.. సన్‌స్క్రీన్ లోషన్ తప్పకుండా వాడండి. ఇంటి నుంచి బయల్దేరే ముందు సన్‌స్క్రిన్ లోషన్ రాయండి. ఇది చర్మానికి సన్ టాన్ ఏర్పడకుండా నివారిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్ల ద్రాక్ష పళ్లతో ఊబకాయం దూరం