అనాసపండును తీసుకుంటే రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. పేగు వ్యాధులను దూరం చేస్తుంది. రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే పొట్లకాయను తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. కంటికి మేలు చేస్తుంది.
అత్తిపండు తీసుకుంటే.. శరీర ఉష్ణం తగ్గుతుంది. పిత్తానికి చెక్ పెడుతుంది. కందగడ్డ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది.
చిక్కుడు కాయ హృద్రోగ సమస్యలను నయం చేస్తుంది. నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. రోజుకో ఆపిల్ తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యం పెంపొందడంతో పాటు.. ఒబిసిటీని దూరం చేసుకుని ఆరోగ్యం జీవించవచ్చు.
ఇక క్యారెట్ ఆరోగ్య ప్రయోజనాలేంటో పరిశీలిస్తే..
* క్యారెట్ అధికంగా తీసుకుంటే విటమిన్ ఎ లభిస్తుంది.
* కంటి చూపును మెరుగుపరుస్తుంది. తద్వారా దృష్టిలోపాలను దరిచేరనివ్వదు.
* ఉదర సంబంధిత రుగ్మతలకు క్యారెట్ పచ్చడి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
* శరీరంలోని ఫాట్‌ను కరగదీయడంతో క్యారెట్ బాగా పనిచేస్తుంది. అంటు వ్యాధులను దూరం చేస్తుంది. కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.