వేసవికాలం మండిపోతున్న ఎండల కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు కలిసే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం అవసరం. దానికి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. దానితో పాటు శరీరాన్ని చల్లగా ఉంచుకునే ఆహారాన్ని ఎంచుకోవాలి.
వేసవిలో శరీరం చల్లబడాలంటే చద్దన్నం తప్పకుండా తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముందు రోజు వండిన అన్నంలో రాత్రి పూట నీళ్లు పోసి.. మరుసటి రోజు ఉదయం ఆ చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయలు కలిపి తీసుకోవాలి. ఈ చద్దన్నంలో విటమిన్లు, ఐరన్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ చద్దన్నం శరీరానికి శక్తినిస్తుంది.
వేసవికాలంలో చద్దన్నం తీసుకోవడం ద్వారా పీచు, ప్రోబయోటిక్స్ అధికంగా లభిస్తాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్, అజీర్ణ రుగ్మతలను దూరం చేస్తుంది. చద్దన్నంలోని మంచి బ్యాక్టీరియా పేగులకు మేలు చేస్తుంది.
అసిడిటీని దూరం చేస్తుంది. చద్దన్నంలో బి విటమిన్, మెగ్నీషియం, ఇనుముతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలను కలిగివుంటుంది. చద్దన్నం త్వరగా జీర్ణమవుతుంది, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.