Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలు రోజూ ఓ కప్పు ఓట్ మీల్ తీసుకుంటే?

Advertiesment
Oat meal benefits for women
, సోమవారం, 13 ఏప్రియల్ 2015 (17:04 IST)
మహిళలు తప్పకుండా రోజు ఒక కప్పైనా ఓట్ మీల్ తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. ఓట్ మీల్ గుండె ఆరోగ్యానికి, శరీరానికి కావల్సిన ఫైబర్ ను ఎక్కువగా అందించడానికి ఇది చాలా సహాయపడుతుంది. అంతేకాదు ఇది కొంత వరకూ కాల్షియాన్ని కూడా శరీరానికి అందిస్తుంది. ఇది మహిళలకు ఫర్ ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. 
 
అలాగే సోయా పాలు సాధారణ ఆవు పాలతో పోల్చితే కాల్షియం అధికంగా లేకున్నా, కానీ 300mg కాల్షియాన్ని ఇది అందిస్తుంది. సాల్మన్ కూడా సీ ఫిషే. ఇందులో ఉండే మినిరల్స్ సెలైన్ వాటర్‌లో కరిగి, కలిసిపోతాయి. కాబట్టి సాల్మన్ ఫిష్‌ను తరచూ ఆహారంతో పాటు తీసుకోవాలి. 
 
ఇకపోతే.. ఆరెంజ్‌లో అత్యధిక విటమిన్ సితో పాటు శరీరానికి కావల్సిన కాల్షియం కూడా ఇందులో లభిస్తుంది. కాటేజ్ చీజ్‌కు బదులుగా ఈ సోయాబీన్స్‍తో తయారు చేసే చీజ్ లాంటి పదార్థాన్ని టోఫు అంటారు. ఇందులో కూడా కాల్షియం శాతం ఎక్కువే. అలాగే ఒక చెంచా నువ్వులు తినడం వల్ల ఒక గ్లాసు పాలు తాగితే లభించేటంత కాల్షియం శరీరానికి అందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu