చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలొచ్చేశాయా..? ఇందుకు జన్యు సమస్యలు, జీవన శైలి, తీసుకొనే ఆహారం, నివసించే ప్రదేశంను బట్టి వారి ముఖంలో శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత రోజుకూ అరకప్పు బెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని వారు సలహా ఇస్తున్నారు.
ముఖ్యంగా బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంను ఆరోగ్యంగా ఉంచుతాయి. డార్క్ కలర్ బెర్రీస్ వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో ఉత్తమంగా పవిచేస్తాయి. ఈ డార్క్ కలర్ బెర్రీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉండి చర్మసౌందర్యానికి మేలు చేస్తుంది.
అలాగే డార్క్ చాక్లెట్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మానికి నిరంతరం తగినంత రక్తప్రసరణ అందడం వల్ల యంగ్‌గా కనబడుతుంటారు. ఇది ఇంకా మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, దీన్ని యాంటీఏజింగ్ ఫుడ్ గా తీసుకోవచ్చు.
ఇకా తాజా కూరగాయలను డైట్‌లో చేర్చుకోవాలి. వెజిటేబుల్స్ బెస్ట్ యాంటీఆక్సిడెంట్ ఫుడ్. ఇవి ఏజింగ్ ప్రొసెస్‌ను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.