Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోండి.. ఊబకాయాన్ని దూరం చేసుకోండి... టిప్స్

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాతే మెడిసిన్స్ తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, పొట్టలో గ్యాస్, మంట వంటి సమస్యలు వస్తాయి. పరకడుపున సోడా, కూల్ డ్రింగ్స్ తీసుకుంటే ఎసిడిటి లె

రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోండి.. ఊబకాయాన్ని దూరం చేసుకోండి... టిప్స్
, గురువారం, 23 మార్చి 2017 (13:28 IST)
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాతే మెడిసిన్స్ తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, పొట్టలో గ్యాస్, మంట వంటి సమస్యలు వస్తాయి. పరకడుపున సోడా, కూల్ డ్రింగ్స్ తీసుకుంటే ఎసిడిటి లెవెల్స్ పెరుగుతాయి.
 
ఉదయాన్నే స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. తేలిక పాటి ఆహారం తీసుకోవడం వల్ల ఈజీగా జీర్ణమవుతుంది. ఉదయాన్నే స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల అల్సర్ వచ్చే అవకాశముంది. ఉదయాన్నే పరగడుపున టమోటాలు తినకూడదు.
 
వర్కవుట్‌కి ముందు స్నాక్స్ అయినా తీసుకోవాలి. ఏమీ తినకుండా వర్కవుట్ చేయడం వల్ల బరువు తగ్గడమేగానీ, కండరాల నొప్పులు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
 
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ స్వెట్ లేదా చెమట బయటకు వస్తుంది.
 
ప్రతిరోజూ కొబ్బరి నూనె నాలుగు చెంచాలు, సలాడ్లు లేదా గ్రీన్ టీ లేదా మీరు ఇష్టంగా తినే ఇతర పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యవంతమైన నిగనిగలాడే చర్మం, దానితో పాటు దట్టమైన నల్లని జుట్టును సొంతం చేసుకోవచ్చు. 
 
తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసినట్లయితే. మళ్లీ విడిగా కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాగే పెరుగులో తేనెను కలిపి రాసుకున్నా చక్కని కండీషనర్‌లా ఉపయోగపడుతుంది.
 
పెరుగులో శనగపిండని కలిపి, నలుగు పిండిలా శరీరానికి పట్టిస్తే.. చర్మం, మీదనున్న మృత కణాలు తొలగిపోతాయి. అలాగే పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగును ఆహారంతో పాటు తీసుకుంటే ఊబకాయం దరిచేరదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్టుగా కలలు వస్తే...