శాఖాహారులైనప్పటికీ ఒబిసిటీతో ఇక్కట్లు తప్పలేదా... అయితే చియాసీడ్స్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ కలిగిన చియా సీడ్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే బరువు తగ్గుతారు. వీటిలో చేపల్లో ఉన్నంత శాతంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగి ఉన్నాయి.
అయితే శరీరం వీటిని ఆల్ఫా లినోలెనిక్‌గా మార్పు చేసుకోవాలి. ఇవి చేపల్లో అయితే నేరుగా డిహెచ్‌ఎ లేదా ఇపిఎగా పొందుతాము. ఒమేగా 3 ఆసిడ్స్ కాకుండా, చియా సీడ్స్‌లో యాంటీఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, మరియు డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి.
వీటి వల్ల పొట్ట నిండుగా అనుభూతి కలిగి, ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది . కాబట్టి డైలీ డైట్ లో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌ను చేర్చుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
చియా సీడ్స్‌ను ఎలా తినాలి?
* చియా సీడ్స్‌ను స్మూతీస్, సలాడ్స్, మరియు పెరుగులో జోడించి తీసుకోవచ్చు.
* మీరు ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్‌లో జోడించుకోవచ్చు.
* ఇంకా, సూప్స్ మరియు గ్రేవీస్‌లో చిక్కగా ఉండటానికి కూడా చియా సీడ్స్ ను ఉపయోగించుకోవచ్చు.