పొద్దున్నే తింటే బరువు పెరిగిపోరు.. అల్పాహారం తీసుకోకపోతే?
పొద్దున్నే తింటే బరువు పెరిగిపోరు.. బరువు తగ్గుతారు. హడావుడిలో అల్పాహారం మానేస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉదయం రెండు ఇడ్లీలూ, ఓ దోశ, కప్ప
పొద్దున్నే తింటే బరువు పెరిగిపోరు.. బరువు తగ్గుతారు. హడావుడిలో అల్పాహారం మానేస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉదయం రెండు ఇడ్లీలూ, ఓ దోశ, కప్పు ఓట్స్, ఓ పండూ ఇలా ఏదో ఒకటి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అల్పాహారంలో మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి.
చాలామంది మహిళలు మంచినీళ్లు ఎక్కువగా తాగరు. తద్వారా చర్మం పొడిబారుతుంది. ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే దాహం వేసినా వేయకపోయినా అప్పుడప్పుడూ ఓ గ్లాసు నీళ్లు తాగుతూ ఉండాలి. వీలైనంతవరకూ నూనె, చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకుంటూ, తృణధాన్యాలూ, పండ్లూ, కూరగాయల మోతాదును పెంచితే.. మహిళల ఆరోగ్యం భేష్‌గా ఉంటుంది.
అలాగే సాయంత్రం పూట స్నాక్స్‌గా సమోసా, సాస్, పఫ్, బజ్జీలు తినడానికి బదులు డ్రై ఫ్రూట్స్, క్యారెట్, పెరుగు, కూరగాయ ముక్కలు కలిపి సలాడ్స్ రూపంలో తీసుకోవాలి. చీజ్ లేని శాండివిచ్ తీసుకున్నట్లైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.