Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

30 అయినా 40లా కనబడుతున్నారా? డైట్ ప్లాన్ మార్చేయండి!

30 అయినా 40లా కనబడుతున్నారా? డైట్ ప్లాన్ మార్చేయండి!
, బుధవారం, 6 మే 2015 (18:31 IST)
మీకు మూడుపదులైనప్పటికీ.. మీకు 40 సంవత్సరాలా? అని ఎవరైనా అడిగితే..? ఏంటండీ.. ఇలా అడిగేశారు.. నాకింకా 30 సంవత్సరాలే అని ఎప్పుడైనా సమాధానమిచ్చారా..? అయితే తప్పకుండా మీరు ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే.

వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలంటే.. ప్రతిరోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్‌లో వట్టి పండ్లను తీసుకోండి. మధ్యాహ్న భోజనంలో పండ్లు, పప్పు కూరలు ఉండేలా చూసుకోండి. రాత్రిపూట ఆహారం 8 గంటల్లోపే పూర్తి చేయండి. రాత్రి డిన్నర్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లితో తయారు చేసిన చట్నీలు కానీ.. పొడులు కానీ ఉండేలా చూసుకోండి. 
 
అదే పిల్లలకైతే రాత్రిపూట పాలు ఇవ్వడం అలవాటైతే.. రెండు గంటల ముందే అంటే 7 లేదా 8 గంటల్లోపే ఆహారం తినిపించేయాలి. 90 శాతం శాకాహారమే వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. ఎక్కువ నీటిని తాగడం ద్వారా యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేసుకోవచ్చు.

పిల్లలకు ఫాస్ట్ ఫుడ్‌లను అలవాటు చేయకుండా రోజుకు 3-4 లీటర్ల నీరు తాగేలా అలవాటు చేయండి. జీలకర్రతో మరిగించిన నీటిని వడగట్టి తీసుకోవడం ఉత్తమం. అధికంగా కారం, మసాలా, పులుపు చేర్చిన ఆహారాలను తీసుకోకూడదని, గోధుమలతో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా నిత్యయవ్వనులుగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu