Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రెగ్నెన్సీ : సముద్ర చేపల్ని తీసుకోవచ్చా? కూడదా?

Advertiesment
Avoid
, మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (14:52 IST)
గర్భధారణ సమయంలో గర్భస్థ శిశువుకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లను పొందటానికి చేపలు తినాల్సిందే. కానీ కొన్ని రకాలైన సముద్ర చేపలను ప్రెగ్నెన్సీ టైమ్‌లో తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ముఖ్యంగా పెద్ద సముద్రపు నీటిలోని చేపలు పాదరసం యొక్క ఆనవాళ్ళను కలిగిఉంటాయి. వీటివలన మీ శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి సంబంధించిన కొన్ని తీవ్రమైన పరిస్థితులకు దారితీయవచ్చు.
 
సాధారణంగా, పాదరసం పరిశ్రమల వ్యర్థపదార్థాలను సముద్రంలోకి వదలటం ద్వారా సముద్రపు నీటిలోకి ప్రవేశిస్తుంది మరియు మిథైల్ మెర్క్యూరీగా మారుతుంది. ఈ ఘోరప్రమాదకరమైన సమ్మేళనం ద్వారా నీరు కలుషితమై, నీటిలో నివసించే చేపలలోకి ప్రవేశిస్తుంది. ఇది చేపను శుభ్రంగా వండిన తర్వాత కూడా అందులోనే నిల్వ ఉంటుంది. 
 
గర్భధారణ సమయంలో పాదరసం ఎక్కువ స్థాయిలో ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వలన శిశువు యొక్క మెదడు మరియు కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభావం పడవచ్చు.
అందువలన ముందు జాగ్రత్త చర్యగా, చేపను ఆహారంగా వారంలో ఒకసారి తీసుకోండి. ఇంకా చేపల వినియోగాన్ని పరిమితం చేసుకోండి.
 
చేపలు బాగా ఉడికాకే తీసుకోవాలి. పచ్చిగా లేదా వండని చేపలు తింటే ప్రతికూల పరిణామాలతో ఇబ్బందులు తప్పవు. స్వోర్డ్ ఫిష్, రాజు మాకేరెల్ మరియు షార్క్ వంటి పెద్ద సముద్ర నీటి చేపలను ప్రెగ్నెన్సీలో నివారించండి. వీటికి బదులుగా కట్ల, హిల్సా, సుర్మై వంటి స్థానిక చెరువులలో కనిపించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువుకు ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu