యాపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ విత్తనాలు తినకూడదు. యాపిల్‌ను అలాగే తినవచ్చు. సలాడ్‌లుగా తరిగి లేదా జ్యూస్‌గా తీసుకోవడం ఉత్తమం. ఆపిల్‌ను రోజుకొకటి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
అలాంటి ఆపిల్‌తో టీ తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే మహిళలు ఆపిల్ టీ తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఆపిల్ టీ తయారు చేయడం సులభం. ఎలా చేయాలంటే..
కావలసిన పదార్థాలు
యాపిల్ - 1
నీరు - 3 కప్పులు
నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్
టీ బ్యాగులు - 2
దాల్చిన చెక్క లేదా లవంగం పొడి... కాసింత
తయారీ విధానం:
ఒక పాత్రలో నీరు పోసి స్టవ్ వెలిగించి టీ బ్యాగులను నీళ్లలో వేసి మరిగించాలి. ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన యాపిల్ ముక్కలను జోడించాలి. ఇలా తక్కువ వేడి మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా దాల్చిన చెక్క లేదా లవంగాల పొడిని వేయాలి. తర్వాత టీ బ్యాగ్స్‌ని తీసేసి టీ కప్పులోకి మార్చి తేనె కలుపుకుని సేవించాలి.