ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా... పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత. విటమిన్ బి12 తప్పనిసరి..! |
|
తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది... |
|
|
అంతేగాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం వల్ల, రుతుసమయంలో అధిక రక్తస్రావం వల్ల, ఫైల్స్ సమస్య వల్ల కూడా రక్తహీనత వస్తుంది. దీనివల్ల రక్తంలో ఎర్రకణాల సంఖ్య తగ్గిపోయి శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒంట్లో నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తలనొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.
మరి దీనికి పరిష్కారమే లేదా..? అంటే ఉందని చెప్పాలి. అదేంటంటే... మందులకన్నా... ప్రతిరోజూ వీరు తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా లభించే వాటినే తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా కాయగూరలు, పండ్లలో ఉంటుంది.
తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే... ముడి గోధుమలు, ఎర్ర బియ్యం, సోయాబీన్స్, తేనె లాంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. మాంచి బలవర్థకమైన ఆహారం తీసుకోవడంతో పాటుగా... రోజుకు కనీసం రెండు సిట్రస్ ఫలాలను అయినా క్రమం తప్పకుండా తీసుకోవాలి.
అంతేగాకుండా బీట్‌రూట్ రసాన్ని తీసుకున్నట్లయితే... రక్తహీనత సమస్య నుండి చాలా త్వరగా బయటపడవచ్చు. బీట్‌రూట్ రక్తంలో ఉండే ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచటమే గాకుండా... శరీరానికి కావలసిన తాజా ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. కాబట్టి చాలామంది ఎదుర్కుంటున్న ఈ రక్తహీనత సమస్యను అధిగమించేందుకు పై సూచనలను తప్పకుండా పాటిస్తారు కదూ...!