Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీపి రసంతో కలకాలం బతకవచ్చు...

Advertiesment
మహిళ ఆహారం వ్యాయామం ప్రొటీన్ తీపి రసం చక్కెర తోటపని మొక్కలు పెంపకం స్త్రీ పురుషులు అధిక బరువు ఊబకాయం కండరాలు డ్రింక్ ఆయుస్సు ఆరోగ్యం
, సోమవారం, 15 సెప్టెంబరు 2008 (17:02 IST)
FileFILE
తరతరాలుగా ఈ విషయం మనిషి మేధస్సును వెంటాడుతోంది. సమాధానం లేని ప్రశ్నలతో మనుషుల మెదళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కొంత మంది ఇతరుల కంటే ఎక్కువ కాలం ఎలా బతకగలుగుతున్నారు? దీనికి సమాధానం ఉందని తాజా అధ్యయన చెబుతోంది. అదేమిటంటే వ్యాయామం మరియు సరైన ఆహారం..

మాంచెస్టర్ మెట్రోపోలిటన్ యూనివర్శిటీ పరిశోధకులు కొత్తగా ఓ విషయం కనిపెట్టారు. దీర్ఘకాలం, ఆరోగ్యంగా బతకడం ఎలా అనే రహస్యం చిక్కు ముడి విప్పేశామని చెప్పారు. తీపి రసం సేవించడం.. కాస్త వ్యాయామం.. తోట పని చేయడం, పోషకాహారం ప్రతిరోజు తీసుకోవడం అనేవే ఆయుర్దాయం పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయని కనుగొన్నారు.
కలకాలం బతకడం ఎలా...
  చివరి వరకు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, ఆరోగ్యంగా జీవించాలనుకునే మనిషి పురా కోరిక రకరకాల ప్రయోగాలకు బాట వేస్తోంది. ముది వయస్సులో కాస్త నడవండి.. తేలికగా ఉండే తీపి రసాలను తీసుకోండి.. పోషక విలువలు ఉన్న మితాహారాన్ని తీసుకోండి. దీర్ఘాయువుకు ఇదే మార్గం...      


చక్కెర కలిపిన రసం, కాసింత వ్యాయామం, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వంటివి మనిషి బరువును తగ్గించి, కండరాలను పెంచి, శారీకర సమతుల్యతను నిర్మిస్తున్నాయని ఈ పరిశోధకులు స్పష్టం చేశారు.

మీరు తోటపని లేదా మొక్కలు పెంచే పని చేయడానికి పోతున్నట్లయితే ముందుగా ఒక గ్లాస్ ఆరెంజ్ రసం తాగవలసిందని మాంచెస్టర్ పరిశోధకుల బృంద నేత డాక్టర్ గ్లేడీస్ పియర్సన్ సూచిస్తున్నారు. పని పూర్తయిన తర్వాత కాస్త పాలు తీసుకుంటే మంచిదట.. ఎందుకంటే శరీరం ప్రొటీన్‌ను తీసుకోవడానికి అప్పుడు సిద్ధంగా ఉంటుందని గ్లేడీస్ చెబుతున్నారు.

దాదాపు 80 మంది ఫించన్‌దారులతో ఈ పరిశోధక బృంద0 మూడునెలల ప్రయోగాన్ని జరిపింది. ఈ ప్రయోగానంతరం దీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు గాను తగిన వంటకాన్ని వీరు కనిపెట్టేశారు.

65 నుంచి 92 ఏళ్ల లోపు వయసున్న స్త్రీపురుషులు ఈ ప్రయోగంలో భాగంగా వ్యాయామశాలలో తాచీని ఆచరించారు. శరీరాన్ని సమస్థితిలో ఉంచడానికి గాను కళ్లు మూసుకుని ఒంటి పాదం మీద నిలబడ్డారు. తర్వాత చిన్నపాటి నడకను సాగించారు. వీరిలో కొంతమందిని తీవ్రంగా వ్యాయామం చేయమని చెప్పారు. ఇతరులను చక్కెర కలిగిన రసాన్ని వ్యాయామం చేయడానికి ముందు తాగమని, వ్యాయామం పూర్తయ్యాక ప్రొటీన్ కలిపిన డ్రింక్‌ను తాగమని చెప్పి చేయించారు.

మూడు నెలల తర్వాత చూస్తే అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని తేలింది. కాని తక్కువ వ్యాయామం చేస్తూ, చక్కెర రసం మరియు ప్రొటీన్ డ్రింక్‌ను తీసుకున్న వారిలో గణనీయంగా మార్పు కనిపించింది. ఈ విభాగంలోని వారు మరింత బరువును పోగొట్టుకుని తమ కండరాల శక్తిని పెంచుకున్నారు. ఇతరులతో పోలిస్తే మరింత కులాసాగా ఉన్నారని పరిశోధకు బృందం కనిపెట్టింది.

వ్యాయామాన్ని తీవ్రస్థాయిలో చేసిన వారికంటే స్వల్ప స్థాయితో సరిపెట్టి వ్యాయామానికి ముందూ తర్వాతా తీపి రసం, మరియు పోషకాహారవిలువలు కలిగిన రసాలను తీసుకున్న స్త్రీపురుషులు మరింత దృఢంగా, కులాసాగా, ఆరోగ్యకరంగా ఉన్నారని ఈ పరిశోధనలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu