Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భవతులు రోజూ ఐరన్ కలిగిన ఆహారం తీసుకుంటే?

గర్భవతులు రోజూ ఐరన్ కలిగిన ఆహారం తీసుకుంటే?
FILE
గర్బవతులు రోజూ ఐరన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు బరువు పెరుగుతుందని తాజా అధ్యయనం తేల్చింది. ప్రతిరోజూ 66 మిల్లీ గ్రాముల ఐరన్‌ తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా బరువు పెరుగుతుందని యుకె అండ్‌ యుఎస్‌‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

ఐరన్ తీసుకోవడం వల్ల తల్లి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడంతో పాటు రక్తహీనతకు కూడా నివారిస్తుంది. అంతేకాకుండా నెలలు పూర్తి కాకుండానే ప్రసవం కలగడం వంటివి తగ్గుతాయి.

తక్కువ బరువు కలిగిన నెలలు పూర్తికాకముందే పుట్టడం ద్వారా పలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ప్రతిరోజూ గర్భవతులు ఐరన్ తీసుకోవడం ఎంతో అవసరమని అధ్యయన శాస్త్రవేత్తలు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu