Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాలుక్కాయల కషాయం తాగితే ఏమవుతుంది?

యాలుక్కాయల కషాయం తాగితే ఏమవుతుంది?
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (09:24 IST)
నీరసాన్ని పోగొట్టి ఆకలిని పెంపొందించడంలో యాలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వంటకాలలో సువాసన ద్రవ్యంగా ఉపయోగించబడే యాలుకలో ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. దానిలోని గింజలు కూడా ఔషధల గుణాలను కలిగి ఉన్నాయి. 40 సంవత్సరాలు వాటిమీద పరిశోధనలు జరిగాయి. సువాసన కలిగిన యాలుక గింజలు కడుపు నొప్పిని నయం చేస్తాయి. జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. 
 
ఆయుర్వేద వైద్యంలో ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, కిడ్నీలో రాళ్ళు, ఇంకా బలహీనతను పోగొట్టడంలో యాలుకలు ఉపయోగించబడుకున్నాయి. నోటి దుర్వాసనను పోగొట్టడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది. మానసిక ఒత్తిడికి గురైన వారు యాలుకల "టీ" తాగితే ప్రశాంతతను పొందుతారు.
 
టీ పొడి తక్కువగానూ, యాలుక్కాయలు ఎక్కువగానూ కలిపి టీ తయారు చేస్తున్నపుడు వెలువడే సువాసనను ఆఘ్రాణించడం వల్ల, ఆ టీ తాగడం వల్ల కలిగే నూతనోత్సాహం వల్ల మానసిక ఒత్తిడి త్వరగా నయమైపోతుందట. 
 
నోటిలో నీరు ఊరడం, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఏర్పడే తలనొప్పి, వాంతులు, ఊపిరితిత్తుల్లో కఫం మొదలైన సమస్యలకి కేవలం యాలుక్కాయలను నోట్లో వోసుకుని నమలడంతోనే నివారణ లభిస్తుందట. కాబట్టి దీన్ని ఎక్కువగా ఉపయోగించడం మంచిదికదా

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శెనగలు ఉడికించిన నీటితో వేడి వేడి రసం తయారు చేస్తే?