తులసీ ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు మటాష్

సోమవారం, 13 జనవరి 2020 (11:55 IST)
తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది. తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. అలాగే నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. 
 
శీతాకాలంలో  జలుబు, దగ్గుతో బాధపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, ఐదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన కషాయాన్ని తాగితే ఫలితం ఉంటుంది.
 
ఇక గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి తులసి దివ్యౌషధంగా పనిచేస్తుంది. కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కనురెప్పల మీద రాస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ రసం కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. 
 
తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి. తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శీతాకాలంలో పుదీనా ఆకులు తప్పనిసరి..