Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స‌ర్వ‌రోగ నివార‌ణి త్రిఫల చూర్ణం... వాత‌, పిత్త‌, క‌ఫం మాయం

ఒక మ‌నిషికి రోగం అంటే... ఆయుర్వేద భాష‌లో వాతం, పిత్తం, క‌ఫం... ఈ మూడింటిలో ఏదో ఒక‌టి ఉంద‌న్న‌మాట‌. వీట‌న్నింటినీ స‌రిచేసి పూర్తి ఆరోగ్యం ఇవ్వాలంటే... అది స‌ర్వ‌రోగ నివార‌ణి త్రిఫ‌ల చూర్ణంతోనే సాధ్యం. ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీ బైయోటిక్. మన శరీరాన్ని

Advertiesment
triphala powder benefits
, గురువారం, 25 ఆగస్టు 2016 (20:43 IST)
ఒక మ‌నిషికి రోగం అంటే... ఆయుర్వేద భాష‌లో వాతం, పిత్తం, క‌ఫం... ఈ మూడింటిలో ఏదో ఒక‌టి ఉంద‌న్న‌మాట‌. వీట‌న్నింటినీ స‌రిచేసి పూర్తి ఆరోగ్యం ఇవ్వాలంటే... అది స‌ర్వ‌రోగ నివార‌ణి త్రిఫ‌ల చూర్ణంతోనే సాధ్యం. ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీ బైయోటిక్. మన శరీరాన్ని శుభ్రం చేయడంతో మనకు ఎంతగానో ఉపకరించే ఆయుర్వేద ఔషధం త్రిఫల చూర్ణం. 
 
ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల‌ చూర్ణం.  త్రిఫల‌ చూర్ణాన్ని త్రిదోష రసాయనంగా చెబుతారు. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను ఈ చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీ వ్యవస్థకు, పిత్తం జీవనక్రియలకు, కఫం శరీర నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడు కాయలను సమాన పాళ్లలో తీసుకుని గింజలు తీసేసి మెత్తని చూర్ణంగా చేయాలి. ఈ పౌడర్‌ని ప్రతి రోజు రాత్రి అర టీస్పూను చొప్పున వేడి నీళ్లతో ఒక నెల వాడాలి. త్రిఫలా చూర్ణాన్ని ఎక్కువ రోజులు వాడితే శరీరం దానికి అలవాటు పడుతుంది. అది మంచిది కాదు.
 
త్రిఫలాలో వాడే కరక్కాయ చాలా శక్తివంతమైనది. అయితే దీనిని ఉపవాసం ఉన్నవారు, గర్భిణులు, శరీరంలో పిత్త దోష గుణం ఉన్నవారు వాడకూడదు. దీనిని త్రిఫలా చూర్ణంతోనే కాక ప్రత్యేకంగా కూడా వాడవచ్చు. పలు రకాల జీర్ణ సంబంధ, శ్వాస సంబంధ వ్యాధులకు ఇది చక్కగా పని చేస్తుంది. దీనిని క్రమబద్ధంగా నోటితో చప్పరిస్తే ఇది అజీర్ణానికి మంచి విరుగుడు. జీర్ణశక్తిని పెంచుతుంది. కరక్కాయతో ఏదైనా ఔషధాన్ని తయారుచేసుకుని వాడుతున్నవారు తప్పనిసరిగా తమ ఆహారంలో ఆవు నెయ్యిని వాడాలి. ఎందుకంటే ఆవు నెయ్యిలో వేడి గుణం హెచ్చుగా ఉంటుంది. త్రిఫ‌ల చూర్ణం త‌గు మాత్రం వాడితే మ‌న శ‌రీరంలోని దోషాలు నివార‌ణ అయిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రిపూట పడకగదిలో జరిగింది కూడా చెప్పేస్తున్నాడు... ఆయనకు మెంటలేమో...?