ప్లాస్టిక్ ఆకుల్ని పక్కనబెట్టి.. అరటి ఆకులో భోజనం చేయండి..
అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోవాలా..? అయితే ఈ స్టోరీ చదవండి. ప్రస్తుతం గ్రీన్ టీ తాగడం ఫ్యాషన్‌గా మారిపోయింది. గ్రీన్ టీలో వుండే Epigallocatechin gallate (EGCG) పోలి
అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోవాలా..? అయితే ఈ స్టోరీ చదవండి. ప్రస్తుతం గ్రీన్ టీ తాగడం ఫ్యాషన్‌గా మారిపోయింది. గ్రీన్ టీలో వుండే Epigallocatechin gallate (EGCG) పోలిపెనాల్స్ అరటి ఆకులో అధిక శాతం ఉన్నాయి. ఇవి పలు రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది.
క్యాన్సర్‌తో పాటు పార్కిన్‌సన్ వ్యాధి (Parkinson’s disease) రానీయకుండా అరికట్టడంలో అరటి ఆకులు భేష్‌గా పనిచేస్తాయి. అయితే అరటి ఆకును అలాగే తీసుకోవడం జీర్ణశక్తికి తగినది కాదు. అందుకే అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా దాని నుంచి ఆరోగ్యానికి లభించే ఔషధ గుణాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అరటి ఆకులో తినడం ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు..
అరటి ఆకులో తినే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ దరిచేరదు. అరటిలో యాంటీయాక్సిడెంట్లు అనారోగ్య కారకాలను నశింపచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులోని రుటిన్, గ్లూకోజ్ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండెపోటు అరికడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అరటి ఆకు క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.
ఆహారంలోని విష పదార్థాలను హరిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అందుచేత ఇకపై పేపర్ అరటి ఆకులను పక్కనబెట్టి.. సహజసిద్ధమైన ప్రకృతి ద్వారా లభించే.. ఆరోగ్యానికి మేలు చేకూర్చే అరటి ఆకులో భోజనం చేయండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.