Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముల్లంగి గింజలతో శీఘ్ర స్కలనం సమస్య పోతుందా...? మూత్రపిండాల్లో రాళ్ళు ముల్లంగితో కరుగుతాయా?

లేతగా ఉండే ముల్లంగి కూర వాత పిత్తాలను హరిస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. కడుపులో ఏర్పడే బల్ల, దగ్గు, ఉబ్బసము, వ్రణము, కంటి జబ్బులు, గొంతు వ్యాధి, అజీర్ణము, మలమూత్ర బంధనము పడిశములను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు చాలా మంచిది. మూత్ర పిండాల్లో రాళ్ళున్న వ

ముల్లంగి గింజలతో శీఘ్ర స్కలనం సమస్య పోతుందా...? మూత్రపిండాల్లో రాళ్ళు ముల్లంగితో కరుగుతాయా?
, గురువారం, 17 నవంబరు 2016 (16:13 IST)
లేతగా ఉండే ముల్లంగి కూర వాత పిత్తాలను హరిస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. కడుపులో ఏర్పడే బల్ల, దగ్గు, ఉబ్బసము, వ్రణము, కంటి జబ్బులు, గొంతు వ్యాధి, అజీర్ణము, మలమూత్ర బంధనము పడిశములను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు చాలా మంచిది. మూత్ర పిండాల్లో రాళ్ళున్న వారు ముల్లంగి రసంలో పంచదార కలిపి తీసుకుంటే రాళ్ళు కరిగిపోతాయి. 
 
ముల్లంగి తీక్షణంగా కారంగా కొంచెం చేదు కలిగి ఉంటుంది. ఇది క్రిములను నశింపజేస్తుంది. ఆకలిని పెంచుతుంది. శరీర లోపలి భాగం నందలి గడ్డలను కరిగిస్తుంది. హృదయ రోగాలను, కుష్టు రోగాలను, చర్మరోగాలను, ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. మూత్ర దోఫాలను, క్షయను తగ్గిస్తుంది. నేత్రరోగాలకు మంచిది. శరీరంపై దురదలు, దద్దుర్లు తగ్గిస్తుంది.
 
సన్నగా తరిగిన నాలుగు ముల్లంగి ముక్కలలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తింటుంటే మలబద్దకం, అజీర్తి, కడుపునొప్పి, ఆకలి లేకుండుట మొదలగు జీర్ణకోశ వ్యాధులే గాక మొలల వ్యాధి గూడ నెమ్మదిస్తుంది. 
 
ముల్లంగి మెత్తగా నూరి ఒక ఒకప్పు రసంలో సమానంగా తేనె కలిపి రోజుకు 3 సార్లు తాగుతుంటే క్రమంగా దగ్గు తగ్గుతుంది. ముల్లంగి ఆకులను నూరి రసం తీసి రోజుకు ఒక ఒక కప్పు వంతున 15 రోజులు త్రాగుతుంటే మూత్రం సాఫీగా జారీ అవటమే కాకుండా మూత్రకోశ వ్యాధులను కూడా నివారిస్తుంది. ముల్లంగి గింజలను మెత్తగా నీటితో నూరి, ఆ మిశ్రమాన్ని తామరకు పైపూత మందుగా వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
స్పూను ముల్లంగి గింజలను ఆవు పాలలో వేసి బాగా కాచి ప్రతిరోజూ రాత్రిపూట త్రాగుతుంటే 20-30 రోజులలో శీఘ్ర స్కలనం నివారించబడుతుంది. ఎండబెట్టిన ముల్లంగి ముక్కను 10 గ్రాములు తీసుకొని 2 కప్పులు నీటిలో వేసి ఒక కప్పు మరిగే వరకు కాచి వడపోసి రెండు లేక 3పూటలు గోరు వెచ్చగా సేవిస్తుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
 
ముల్లంగి గింజలను ఉత్తరేణి క్షారంతో కలిపి మెత్తగా నూరి మచ్చలపై లేపనం చేస్తుంటే అతి త్వరలో మచ్చలు అదృశ్యమై తిరిగి మామూలు చర్మపు రంగు వస్తుంది. ఒక ఒకప్పు ముల్లంగి రసములో ఒక కప్పు ఆవాల నూనె కలిపి చిన్న మంటపై రసం ఇగిరే వరకు కాచి, వడపోసి నిలువ చేసుకోవాలి. ఈ తైలాన్ని గోరువెచ్చగా రెండు పూటలా 5-6 చుక్కలు చెవిలో వేస్తుంటే అన్ని రకాల చెవుల సమస్యలు అంతరించిపోతాయి. 
 
ముల్లంగి విత్తనాలను నిమ్మరసంలో కలిపి పలుచగా చర్మంపైన పూస్తే దురదలు, దద్దుర్లు వెంటనే తగ్గిపోతాయి. నువ్వులనూనె వందగ్రాముల కళాయి పాత్రలో పోసి దానిలో 20గ్రాముల ముల్లంగి గింజలను పగులగొట్టి వేసి చిన్న మంటపైన గింజలు నల్లబడే వరకు మరిగించి దించి చల్లార్చి వడపోసి నిలువ ఉంచుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ఈ తైలాన్ని పురుషులు తమ మర్మాంగానికి ముందు బుడిపెను వదిలిపెట్టి వెనుక భాగానికి మృదువుగా నాలుగైదు చుక్కలు మర్దన చేసి ఉదయం పూట స్నానం చేస్తుండాలి. ఏవైనా గుల్లలు రావటం మొదలైతే ఆందోళన చెందక వాటిపై నేతిని రాస్తే అవి తగ్గిపోతాయి. కనీసం 40 రోజుల పాటు ఈ తైలాన్ని మర్మాంగంపైన సున్నితంగా మర్దనా చేస్తే హస్తప్రయోగం వల్ల లేక సుఖరోగాల వల్ల బలహీనమైన పురుషాంగపు నరాలు తిరిగి మరలా శక్తిమంతమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువు తగ్గాలా? భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి.. శృంగారంలో పాల్గొనండి..