రక్తపోటును నివారించే మందార టీ..
రక్తపోటును నియంత్రించాలంటే.. మందార టీని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మందారంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. టేబుల్ స్పూన్ ఎండిన మందార పూల రెక్కలను క
రక్తపోటును నియంత్రించాలంటే.. మందార టీని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మందారంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. టేబుల్ స్పూన్ ఎండిన మందార పూల రెక్కలను కప్పు నీళ్లలో వేసి, పది నిమిషాల పాటు వేడిచేసి, చల్లారాక తాగండి. రోజుకు రెండు కప్పుల మందార టీ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
మందార పూల టీని నిత్యం తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఇది గ్లూకోజ్, ఫ్యాట్స్ వంటి వాటిని శరీరంలో త్వరగా కలవకుండా చేస్తుంది. దీంతో దేహంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోదు. అంతేకాకుండా మందార పూల టీ వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
మధుమేహంతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు చేస్తుంది. పలు రకాల క్యాన్సర్‌లకు మందుగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరానికి శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తుంది.
అలాగే గ్రీన్ టీ సేవించడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందులోని క్యాటచిన్ అనే యాంటీ- ఆక్సిడెంట్ శరీరంలో క్యాలరీలను ఖర్చయ్యేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీ తాగితే బరువు పెరగరదు.
కలబంద లోపలి తెల్లని గుజ్జును తీసుకొని కాలిన శరీర భాగాల మీద రుద్దితే నొప్పి తగ్గుతుంది. అలా రోజుకు రెండుసార్లు చేస్తే కాలిన గాయాల బాధ నుంచి ఉవశమనం లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.