Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నలుపు ద్రాక్ష పొడి, చింతపండు జతచేస్తే..?

Advertiesment
నలుపు ద్రాక్ష పొడి, చింతపండు జతచేస్తే..?
, సోమవారం, 19 నవంబరు 2018 (09:58 IST)
సాధారణంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఆ సమస్యను తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. దాంతో వైద్య చికిత్సలు తీసుకుని వారి ఇచ్చిన మందులు వాడుతుంటారు. ప్రతిరోజూ ఈ మందులు వేసుకుంటేనే నిద్రపడుతుంది. ఇలా రోజూ మందులు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో చూద్దాం..
 
1. ద్రాక్ష పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ నిద్రలేమి సమస్యను తొలగిస్తాయి. అందుకు ఏం చేయాలంటే.. ద్రాక్ష పండ్లను జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
2. జ్యూస్‌గా కాకపోయినా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా ఒట్టి ద్రాక్ష పండ్లను తింటే ఫలితం ఉంటుంది. అలానే నలుపు ద్రాక్ష తొక్కలను పొడిచేసి అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ పాలలో కలిపి సేవిస్తే నిద్రలేమి సమస్య దూరమవుతుంది. 
 
3. ద్రాక్ష పండ్లలలో నిద్రకు సహాయపడే హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్స్ గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
 
4. ప్రతిరోజూ ద్రాక్ష పండ్లు తినే వారికి ఒత్తిడి, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక రోజూ ద్రాక్ష తీసుకోవడం మరచిపోవద్దు. 
 
5. ద్రాక్ష పండ్లలోని విటమిన్స్, క్యాల్షియం, న్యూట్రియన్స్ వంటి ఖనిజాలు నిద్రపోవడానికి సహకరిస్తాయి. వీటిని తరచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటే అనారోగ్య  సమస్యలు దరిచేరవను చెప్తున్నారు. 
 
6. నలుపు ద్రాక్ష తొక్కలను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొన్ని ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు, మినపప్పు, టమోటాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కాస్త కచ్చాపచ్చాగా రుబ్బకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నిద్ర బాధ ఉండదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైంగిక సామర్థ్యంలేని కోరిక.. కత్తిలేని యుద్ధం వంటింది...