వెల్లుల్లిని పరగడుపున తినొచ్చా? కొన్ని వెల్లుల్లి రేకులను పచ్చిగా తింటే?!
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే వెల్లుల్లిని పరగడుపున తీసుకోవచ్చా? తీసుకోకూడదా? తింటే ఏం జరుగుతుందని తెలుసుకోవాలా అయితే చదవండి మరి. వెల్లుల్లిని భోజనం తీసిన తర్వాత
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే వెల్లుల్లిని పరగడుపున తీసుకోవచ్చా? తీసుకోకూడదా? తింటే ఏం జరుగుతుందని తెలుసుకోవాలా అయితే చదవండి మరి. వెల్లుల్లిని భోజనం తీసిన తర్వాత కంటే పరగడుపున తీసుకుంటే చాలామంచిదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
కొన్ని వెల్లుల్లి రేకులను తీసుకుని ఉదయాన్నే పచ్చిగా తింటే ఆరోగ్యపరంగా చాలా లాభం చేకూరుతుందట. అంతేకాదు బీపీని వెల్లుల్లి నియంత్రిస్తుంది. వాపులు, నొప్పులకు వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ప్లామేటరీ గుణాలు అధికం. అందుచేత రక్తం గడ్డకట్టనీయకుండా చేస్తుంది.
అనారోగ్యంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. వీరికి వెల్లుల్లి మంచి ఔషదంలా పనిచేస్తుంది. అలాగే నరాల బలహీనతకు వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదు. వైరస్, బాక్టీరియాలతో పోరాడే ఔషదగుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. కాబట్టి రోజూ వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
ఇక వెల్లుల్లి గుండెకు ఎంతో మేలు చేస్తుందట. వెల్లుల్లి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు దరిచేరవు. అంతేకాదు మదుమేహం వంటి వ్యాధులను సైతం తగ్గించే సామర్ధ్యం దీనికి కలదు. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు కూడా నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.