అరటి ఆకులపై వడ్డించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి రుగ్మతలను తొలగించుకోవాలంటే.. అరటి ఆకులో వేడి వేడిగా ఆహారం తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది.
ఈ ఆకులో విటమిన్లు పుష్కలంగా వుండటం ద్వారా వేడి పదార్థాలను అందులో వడ్డించడం ద్వారా ఆ విటమిన్లు మనం తీసుకునే ఆహారంలో కలిసి.. శరీరానికి పోషకాలు అందిస్తాయి. ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ అరటి ఆకులో వుంది.
హెచ్.ఐ.వి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఇది దూరం చేస్తుంది. అరటి ఆకులో భోజనం విషాన్ని హరిస్తుంది. అలాగే టేకు ఆకులో భోజనం చేస్తే పురాణాల ప్రకారం మంచి భవిష్యత్తు చేకూరుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.