Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు...?

Advertiesment
ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు...?
, శుక్రవారం, 18 జనవరి 2019 (12:52 IST)
ముల్లంగి దుంపల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఇది అంతరుచిగా ఉండదని చాలామంది తినరు. దీనిలో దుంపకన్నా ఆకుల్లో క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. దుంపలతోపాటు ఆకులను కూడా కలిపి వండుకుని తింటే చాలా మంచిది.
 
1. ముల్లంగిని జ్యూస్‌గా తీసుకుని తాగుతుంటే లివర్‌లో కలిగే వ్యాధులను నివారిస్తుంది.
 
2. ముల్లంగి ఆకుల్ని, దుంపని ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని ఒక చెంచా చొప్పున తేనెలో కలిపి తీసుకుంటుంటే ఏ అవయంలో వాపు, నొప్పులున్నా నివారణమవుతాయి.
 
3. పచ్చిముల్లంగి దుంపలు, ఆకుల రసాన్ని తీసి త్రాగుతుంటే సాఫీగా విరేచనమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతూ ఆకలిని కూడా వృద్ధిచేస్తుంది. లివర్ వ్యాధులను తగ్గిస్తుంది.
 
4. ముల్లంగి విత్తులను బాగా ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని రోజూ కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. 
 
5. ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు కొంచెం ముల్లంగిరసాన్ని త్రాగితే వెంటనే తగ్గిపోతాయి.
 
6. విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే త్వరగా ఈ దోషాలు నివారణమవుతాయి. 
 
7. మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళను కరిగించడానికి ముల్లంగి ఎంతో మంచిది. ముల్లంగిని ఆకులతో సహా వండుకుని తింటే ఈ సమస్య నివారణమవుతుంది.
 
8. ముల్లంగి రసంతీసి, దానిలో నాలుగోవంతు నూనెవేసి నూనె మాత్రమే మిగిలేంతగా కాచి ఆ నూనెను భద్రం చేసుకోవాలి. నూనెను వడ గట్టాలి. చెవిపోటు, చెవిలో హోరు మొదలైన బాధలున్నవారు చెవిలో కొంచెం ఈ నూనెను పోస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కీళ్ళవాపులు, నొప్పులు కలిగిన చోట ఈ నూనెను మర్థనా చేస్తే వాపులు, నొప్పులు తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి భోజనం అనంతరం ఉసిరి పొడిలో తేనెను కలిపి తీసుకుంటే?