Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్య ప్రయోజనాలకు ఆయుర్వేద మూలికలు

ayurveda method
, సోమవారం, 18 జులై 2022 (21:43 IST)
ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలు శతాబ్దాలుగా భారతీయ సాంప్రదాయ వైద్యంలో అంతర్భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. డయాబెటిస్, గుండె జబ్బుల నుండి రక్షణతో సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ఆయుర్వేద మూలికలు మూలమవున్నాయి. అందువల్ల ఈ మూలికలు, సుగంధాలను కొద్దిమొత్తంలో జోడించడం వలన భోజనానికి రుచి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి.

 
పవిత్ర తులసి అంటువ్యాధులతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెంతులు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది.

 
జీలకర్ర అనేది సాధారణంగా భోజనానికి రుచిని జోడించడానికి ఉపయోగించే ఒక ఆయుర్వేద మసాలా. ఇది టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులను దరిచేరకుండా చూస్తుంది. దాల్చిన చెక్క పొడితో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు మాయం చేస్తుంది.

 
కరివేపాకును పచ్చడిగానో లేదా విడిగానో తీసుకోవచ్చను. అలాకాకుంటే కరివేపాకు రసాన్ని మజ్జిగలో కలుపుకుని రోజూ తాగితే జీర్ణాశయం చక్కగా పని చేస్తుంది. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది నుండి పదిహేను కరివేపాకులను నమిలి తినాలి. ఇలా నెలరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మధుమేహ వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. 

 
కడుపులో వికారంగా ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నపుడు.. రెండు చెంచాల కరివేపాకు రసంలో కొద్దిగా నిమ్మరసం, పంచదార కలిపి తీసుకుంటే ఇలాంటి సమస్యల రావు. కరివేపాకు బాగా ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలిపి సేవిస్తే విరోచనాలు తగ్గుతాయి. కాలిన గాయాల మీద కరివేపాకు నూరి కట్టుకడితే గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. 

 
కరివేపాకు రసాన్ని పురుగులు కుట్టిన ప్రాంతాల్లో రాసుకుంటే దద్దుర్లు తగ్గిపోతాయి. కరివేపాకును ముద్దగా నూరి, చెంచాడు ముద్దను గ్లాస్ మజ్జిగలో కలిసి తీసుకుంటే కడుపులో వికారాన్ని నివారించవచ్చు. గర్భవతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేసే బేరిపండ్లు