పులిచింత ఆకుతో ఎన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయో తెలుసా?
పులిచింత ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆకును తీసుకుంటే ఈ క్రింది సమస్యలు తగ్గిపోతాయి. 1. పులిచింత ఆకు రసంతో కాస్తంత సైంధవ లవణం కలిపి పూస్తే పులిపిర్లు రాలిపోతాయి. 2. చెట్టు వేళ్లను నూరి లేపనంగా వేస్తే గాయాలే కాదు పెద్దవైన పుండ్లు కూడా మాని
పులిచింత ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆకును తీసుకుంటే ఈ క్రింది సమస్యలు తగ్గిపోతాయి.
1. పులిచింత ఆకు రసంతో కాస్తంత సైంధవ లవణం కలిపి పూస్తే పులిపిర్లు రాలిపోతాయి.
2. చెట్టు వేళ్లను నూరి లేపనంగా వేస్తే గాయాలే కాదు పెద్దవైన పుండ్లు కూడా మానిపోతాయి.
3. పులిచింత వేళ్లను నీటిలో వేసి కాచి, ఆ కషాయంతో 10 నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు సైతం గట్టిపడతాయి. ఈ మొక్క వేళ్లను నీడన ఎండించి పొడి చేసి పండ్ల పొడిగా వాడినా చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
4. సైందవ లవణం చేర్చిన పులిచింత ఆకు రసాన్ని తేలు కుట్టిన చోట రుద్దితే చాలా త్వరగా విషం దిగిపోతుంది.
5. ఆకులతో చేసిన పచ్చడిని తింటూ వుంటే ఆకలి పెరగడంతో పాటు ఆస్తమా తీవ్రత తగ్గుతుంది.
6. 40 నుంచి 60 మి.లీ ఆకు రసంలో పొంగించిన ఇంగువ కలిపి సేవిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది.
7. పదిహేను ఆకుల రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. ఐదారు పులిచింత ఆకులను బాగా నమిలి మింగేస్తే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.