Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నడుము నొప్పికి ఆయుర్వేద వైద్యం... పది చుక్కలు వెల్లుల్లి రసం తీసుకుని....

నడుము నొప్పి సమస్యతో సతమతమయ్యేవారికే ఆ బాధ ఎంతటి తీవ్రంగా ఇబ్బందిపెడుతుందో తెలుస్తుంది. ఈ నడుము నొప్పిని భరించడం చాలా కష్టమవుతుంటుంది. ఐతే ఆయుర్వేద వైద్యంలో నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Advertiesment
ayurveda tips for back pain health issue
, శనివారం, 6 ఆగస్టు 2016 (21:27 IST)
నడుము నొప్పి సమస్యతో సతమతమయ్యేవారికే ఆ బాధ ఎంతటి తీవ్రంగా ఇబ్బందిపెడుతుందో తెలుస్తుంది. ఈ నడుము నొప్పిని భరించడం చాలా కష్టమవుతుంటుంది. ఐతే ఆయుర్వేద వైద్యంలో నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
 
*ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణ కోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. ఆవనూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడినీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.
 
*పంచకర్మ చికిత్సలలో భాగంగా అభ్యంగన స్నానం, కటివస్థ బాగా ఉపకరిస్తాయి. నడుము నొప్పితో బాధపడేవారు... వంకాయ, వేరుశనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువుగా తీసుకోవడం మంచిది కాదు.
 
*లావుగా ఉన్నవారికి నడుం నొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మ రసం పోసి పరగడుపున త్రాగుతుంటే, ఒళ్ళు తేలిక పడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను మంచి నడుంచుట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్ట్ ఎటాక్ వచ్చేముందు కనిపించే లక్షణాలు... ఎలా ఉంటాయి...?