Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లికూతలు... ఆస్త్మా... పడుకోనీయదు మహా చెడ్డ జబ్బు, చిట్కాలివే

ఆస్త్మా వ్యాధి వచ్చినవారు పడుతున్న బాధను చూస్తుంటే తట్టుకోలేకపోతాం. ఎందుకంటే ఆ సమయంలో వారు నిద్రపోలేరు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కిందామీదు అయిపోతుంటారు. కొన్నిసార్లు ఆ స్థితిలో వారిని చూస్తే భయమేస్తుంది. ఆరోగ్యం ఎలా వుంటుందోనన్న బెంగ పట్ట

పిల్లికూతలు... ఆస్త్మా... పడుకోనీయదు మహా చెడ్డ జబ్బు, చిట్కాలివే
, బుధవారం, 8 మార్చి 2017 (20:46 IST)
ఆస్త్మా వ్యాధి వచ్చినవారు పడుతున్న బాధను చూస్తుంటే తట్టుకోలేకపోతాం. ఎందుకంటే ఆ సమయంలో వారు నిద్రపోలేరు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కిందామీదు అయిపోతుంటారు. కొన్నిసార్లు ఆ స్థితిలో వారిని చూస్తే భయమేస్తుంది. ఆరోగ్యం ఎలా వుంటుందోనన్న బెంగ పట్టుకుంటుంది. అందుకే ఆస్త్మా వున్నవారు ఈ క్రింది ఆహారాన్ని తీసుకుంటుంటే తగ్గిపోతుంది. 
 
ఈ సమస్యను అధిగమించాలంటే కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి (కూరగాయ), మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకుంటూ వుండాలి. అలాగే ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి కనుక అవి ఉండే ఆహారం తీసుకోవాలి. 
 
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలాంటివి వుండేట్లు చూసుకోవాలి. తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో అయితే క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు వుండేట్లు చూసుకోవాలి. ఇకపోతే వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా, కొవ్వు తీసిన పాలను రోజూ తీసుకోవచ్చు. అంతేకాకుండా ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు తదితర సహజమైన మసాలా దినుసులు ఆస్త్మా తీవ్రతను తగ్గిస్తాయి. అలాగే స్పూన్ పసుపులో స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకుంటే ఆస్త్మా నివారణిగా పనిచేస్తుంది. ఇంకా పాలలో కానీ లేదంటే టీలో కానీ అరస్పూన్ అల్లం పొడిని కానీ మిరియాల పొడిని కానీ వేసి తాగితే రిలీఫ్ వస్తుంది.
 
ఆస్త్మా సమస్య వున్నవారు పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు తీసుకోకూడదు. అలాగే కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు, రంగులు వేసిన ఆహారం, నిల్వ వుంచిన ఆహారం, బ్రెడ్, ఆవుపాలు తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే ఉప్పు తగ్గించాలి. ఇలా చేస్తే ఆస్త్మాను చాలా వరకూ నిరోధించవచ్చు.
 
‘బాల్యంలో ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక ఆస్త్మా రావడానికి కారణమవుతున్నాయి’ అన్న అధ్యయనాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ఒకప్పుడు ఆడవారు ఉండేవారు...