అరటిదూటతో ప్రయోజనాలెన్నో.. నెలసరి సమయంలో?
కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే అరటిదూట దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా వెలికి వేసే గుణాలు అరటి దూటలో పుష్కలంగా ఉన్నాయి. అరటిదూటను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వ
కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే అరటిదూట దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా వెలికి వేసే గుణాలు అరటి దూటలో పుష్కలంగా ఉన్నాయి. అరటిదూటను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారట. కిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెపితే.. రాళ్లను తొలగించుకోవాలంటే.. అరటిదూట జ్యూస్ తాగాల్సిందే. అరటిదూటను డైట్‌లో చేర్చుకుంటే.. కిడ్నీలో రాళ్లను కరిగింపజేస్తుంది. అందుకే వారానికి మూడుసార్లు అరటిదూటను ఆహారంలో చేర్చుకోవాలి.
అరటిలో పీచు పుష్కలంగా ఉండటం ద్వారా అధిక బరువును తగ్గిస్తుంది. మధుమేహం, రక్తంలోని కొవ్వును వెలివేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వేసవి కాలంలో అరటిదూటను తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఉదర సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది. మహిళలు నెలసరి సమయంలో అరటిదూటను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా టాక్సిన్లలు వెలివేయబడుతాయని, అధికరక్తస్రావం సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.