Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాము నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు.. ఏంటవి?

మన ఆసియా ఖండంలో, మరీ ముఖ్యంగా రాజస్థాన్‌లో విరివిగా పండించే వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జీర్ణ సమస్యలకు విరుగుడుగా కొద్దిగా వాముని వేడినీళ్లలో కలిపి తీసుకోవడం మనకు సాధారణ విషయం. జీలకర్ర ఆకారంలో కనిప

వాము నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు.. ఏంటవి?
, శుక్రవారం, 26 మే 2017 (16:52 IST)
మన ఆసియా ఖండంలో, మరీ ముఖ్యంగా రాజస్థాన్‌లో విరివిగా పండించే వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జీర్ణ సమస్యలకు విరుగుడుగా కొద్దిగా వాముని వేడినీళ్లలో కలిపి తీసుకోవడం మనకు సాధారణ విషయం. జీలకర్ర ఆకారంలో కనిపించినా ఇది దానికంటే చిన్నదిగా ఉంటుంది. కొంచెం ఘాటుగా, కారంగా ఉండే వాముని అజీర్ణానికి మాత్రమే కాదు.. మరెన్నో సమస్యలకు ఔషధంగా ఉపయోగించవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వామునీటిని తయారు చేసుకోవడం కూడా సులభమే. రెండు టీస్పూన్ల వాముని దోరగా వేయించి, దాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. దాన్ని ఉడికించి, వడగట్టి, చల్లబడే వరకు ఆగి తీసుకుంటే సరి. 
 
వాము ఉపయోగాలు
 
* మూత్రాశయంలో రాళ్ళు: వాము నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఉదయం తీసుకుంటే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరుగుతాయి. వాముని వెనిగర్‌ లేదా తేనెతో కలిపి వారం రోజులు తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. 
 
* దగ్గు: 1/2 టీ స్పూన్ వాము, రెండు లవంగాలు, చిటికెడు ఉప్పును కలిపి చూర్ణం చేసి అరకప్పు వేడి నీళ్లలో కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.
 
* అసిడిటీ: గ్యాస్ట్రిక్ గ్రంథులు అధిక మొత్తంలో ఆమ్లాలను ఉత్పత్తి చేసినప్పుడు కడుపులో, గొంతులో కలిగే మంటనే అసిడిటీ అంటారు. సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువ కారంగా ఉండే ఆహారాలను తీసుకోవడంతో పాటు ఒత్తిడి కూడా అసిడిటీకి గల ప్రధాన కారణాలు. వాము నీరు తీసుకుంటే ఈ లక్షణాలు ఉపశమిస్తాయి.
 
* కఫం: రెండు టీ స్పూన్ల వాముని మెత్తగా దంచి, దాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి.
 
* గర్భిణీ స్త్రీలు: భారతదేశంలో గర్భం దాల్చిన స్త్రీలను వామునీరు తీసుకోమని చెప్తుంటారు. గర్భధారణ మూలంగా కలిగే మలబద్దకం, ఉబ్బరానికి వాము గొప్ప ఔషధం. ప్రసవానంతరం కూడా జీర్ణసమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, పాలు పట్టేందుకు, గర్భాశయాన్ని శుభ్రపరిచేందుకు వాము తీసుకోవాలని పెద్దలు చెప్తారు.
 
* కీళ్ళ నొప్పులు: కీళ్లనొప్పులను తగ్గించడంలో వాము కీలకపాత్ర వహిస్తుంది. వామునూనెని కీళ్లకు మర్దన చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముడతల చర్మానికి కమలాపండుతో చెక్.. ఎలా?